English | Telugu
స్కంద, చంద్రముఖి 2 మిస్.. అదే రవితేజ సినిమాకు ప్లస్!
Updated : Sep 9, 2023
ఆర్‌టి టీమ్‌వర్క్స్ పేరుతో రవితేజ స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి పలు చిన్న సినిమాల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో ‘చాంగురే బంగారురాజా’ ఒకటి. రవిబాబు, సత్య, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ సినిమా పూర్తి హాస్యభరిత చిత్రంగా రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి కృష్ణ సౌరబ్ సంగీతాన్ని సమకూర్చారు.
వినాయక చవితి సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ ఆశించినట్టుగా జరగడం లేదు. సెప్టెంబర్ 15కి విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోని చిత్రాలు పండగకు రిలీజ్ అవ్వాల్సి ఉండగా, వాటిలో స్కంద, చంద్రముఖి2 సెప్టెంబర్ 28కి వెళ్ళిపోయాయి. మార్క్ ఆంటోనికి లైకా ప్రొడక్షన్స్‌తో ఉన్న వివాదం కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా రిలీజ్‌ను నిషేధించింది. అయితే ఆ సమస్యల్ని అధిగమించి సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో వినాయక చవితి సీజన్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాత రవితేజ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ‘చాంగురే బంగారు రాజా’ చిత్రాన్ని విడుదల చేస్తే వర్కవుట్ అవుతుందనుకున్న యూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్ కూడా రెడీ చేయించింది. మరి ఈ సినిమాకు వినాయక చవితి సీజన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.