English | Telugu
విజయ్ నెక్స్ట్ సినిమా హాట్ అప్‌డేట్స్!
Updated : Sep 10, 2023
దళపతి విజయ్ నటించే నెక్స్ట్ సినిమాకు సంబంధించిన హాట్ అప్‌డేట్స్ కోడంబాక్కంలో వైరల్ అవుతున్నాయి. వెంకట్ ప్రభు డైరక్షన్‌లో తెరకెక్కుతోంది నెక్స్ట్ సినిమా. ప్రస్తుతం లియో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోంది లియో మూవీ. సెప్టెంబర్ ఎండింగ్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఉంటుంది. అక్టోబర్ 19న లియో సినిమా విడుదలవుతుంది.
అక్టోబర్ 1న దళపతి 68 పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. గాంధీ జయంతి నుంచి దళపతి 68 రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమా కోసం వెంకట్ ప్రభు, విజయ్ కలిసి లాస్ ఏంజిల్స్ కూడా వెళ్లొచ్చారు. డీ ఏజింగ్ టెక్నాలజీ గురించి కూడా ఇద్దరూ డీటైల్స్ తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అఫిషియల్‌గా ఇంతవరకు వారిద్దరూ ఏమీ చెప్పలేదు.
ఈ సినిమాలో విజయ్‌తో సిమ్రన్ జోడీ కట్టనున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాతవీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారు.ఇప్పటిదాకా వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా కూడా హిట్టే అయింది. 2004లో వాళ్లిద్దరూ కలిసి చివరి సారి ఉదయ అనే సినిమాలో నటించారు.
దళపతి 68లో ప్రశాంత్, ప్రభుదేవా కూడా కీ రోల్స్ చేస్తారని వినికిడి.
డాన్, డాక్టర్ చిత్రాల్లో నటించిన ప్రియ మోహన్ కూడా ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తారని టాక్. పెద్ద విజయ్ పక్కన సిమ్రన్, చిన్న విజయ్ పక్కన ప్రియాంక నటిస్తారన్నది వైరల్ అవుతున్న న్యూస్.ఇప్పటిదాకా చూపించని విజయ్‌ని తన డైరక్షన్‌లో చూపించాలనుకుంటున్నారట వెంకట్ ప్రభు. మేజర్ పోర్షన్‌ని చెన్నైలోనే చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. పాటలకు మాత్రం ఫారిన్ కంట్రీస్‌కి వెళ్లాలని అనుకుంటున్నట్టు టాక్.