English | Telugu
రజినీకాంత్ 171 ప్రకటన వచ్చేసింది!
Updated : Sep 11, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లే యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రజినీకాంత్‌తో జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. దీంతో నెటిజన్స్ తలైవర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే లోకేష్ కనకరాజ్ మాస్ హీరోయిజాన్ని నెక్ట్స్ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారు. తను రజినీకాంత్ వంటి గాడ్ ఆఫ్ మాసెస్‌ను డైరెక్ట్ చేస్తే వచ్చే ఔట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
లోకేష్ యూనివర్స్ పేరుతో సినిమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో కార్తి, విజయ్, కమల్ హాసన్, సూర్య వంటి స్టార్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు రజినీకాంత్ కూడా జాయిన్ అయితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ స్టార్స్ అందరూ ఓ సిినిమాలో కనిపిస్తే అదెలా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. మరి తలైవర్ 171 లోకేష్ యూనివర్స్‌లో ఉంటుందా.. ఉండదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
అలాగే అక్టోబర్ నుంచి రజినీకాంత్ 170వ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో ఫేక్ ఎన్‌కౌంటర్స్ మీద పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ కనిపించబోతున్నారు. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌తో పాటు మంజు వారియర్ కూడా నటించబోతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.
మరో వైపు లోకేష్ దసరాకు అక్టోబర్ 19న లియో సినిమాతో లొకేష్ సందడి చేయబోతున్నారు. ఇందులో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. త్రిష హీరోయిన్.