RELATED NEWS
NEWS
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ వారి ఆద్వర్యం లో తెలంగాణా విమోచన దినం

 

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  వారి ఆద్వర్యం లో  తెలంగాణా విమోచన దినం

 



ఈరోజు నిజంగా అరుదైన రోజు..  హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయి. తెలంగాణా సభికులందరికీ శ్రీకాంత్ తుమ్మల  స్వాగతం తెలుపుతూ ప్రారంబించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ మరో 13 నెలల పాటు చీకటి రోజులు గడిపిందని  శ్రీకాంత్అ న్నారు ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ , నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్‌ విస్మరిం చారని పేర్కొన్నారు. ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ  నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం.. భారత దేశంలో విలీనం అయింది వాస్తవం.. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం? సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు?.. సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు.. స్వరాష్ట్రంలోనూ అదే విధానమా? హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?.. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా?.. రాజకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా? అని ప్రశ్నించారు.

 

 

బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్‌ తెలంగాణకు అసలు చరిత్రే లేకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ కీర్తిని , తెలంగాణ చరిత్ర ని ముందు తరాలకి తెలియచేస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు విలాస్ రెడ్డ్డి . లింగాల సంతోష్ మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్.. మరి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారంలో ఉన్నాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు?



 

దిగంబర్ మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా   నిర్యహించాలని డిమాండ్ చేసారు .తెలంగాణ లో  బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తాం అన్నారు. రామ్ వేముల మరియు గోపి సముద్రాల  మాట్లాడుతూ , కేసీఆర్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. వీరుల త్యాగాలను మజ్లిస్‌ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200కిపైగా బలిదానాలు చేసుకుంటే.. 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమన్నారు.

 

 

ఈ కార్యక్రమానికి  ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీకాంత్ తుమ్మల,  ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ కార్యవర్గ సభ్యులు,  శ్రీ కల్పనా శుక్ల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూయార్క్ కోఆర్డినేటర్ శ్రీ శివదాసాన్ నాయర్ గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో-కోర్డినేటర్ శ్రీ ఆనంద్ జైన్ గారు, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్లు  శ్రీ జయశ్రీ నాయర్ గారు,  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, హరి సేతు , గోపి సముద్రాల, రామ్ వేముల  మరియు లింగాల  సంతోష్  ఇతర  ఓఎఫ్ బిజెపీ నేతలు  గారు పాల్గొన్నారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;