RELATED NEWS
NEWS
BJP జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విస్తృత పర్యటన !

ప్రవాస అఖిల భారతీయ విద్యార్ది పరిషత్(ABVP) పూర్వవిద్యార్దులు మరియు భారతీయ జనతా పార్టీ మిత్ర సంఘం (overseas friends of BJP) ఆహ్వానం మేరకు BJP జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు జాతీయ భద్రతా విభాగం కన్వీనర్ శ్రీ పేరాల చంద్ర శేఖర్ గారు ఈరోజు శనివారం నాడు అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ కు ప్రయాణం అవుతున్నారు. డల్లాస్ లో sept 7th ఆదివారం నాడు సాయంత్రం హిల్ టాప్ రెస్టారెంటు లో జరుగనున్న మొదటి ప్రవాస భారతీయుల మేధావుల వేదిక లో భారత దేశం జాతీయ భద్రత కు సంభందించిన అంశాలు,ఈశాన్య రాష్ట్రాలు ,సరిహద్దు భద్రత పై సభికుల నుద్దేశించి ప్రసంగిస్తారు .

 

ఈ సందర్బముగా  సెప్టెంబర్ 28 న న్యూయార్క్ లోని  మాడిసన్  గార్డెన్ (Madison Square Garden)లో జరుగనున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి  సభకు ప్రవాసులను ముఖ్యంగా  తెలుగు వారిని ప్రత్యేకం గా ఆహ్వానించనున్నారు .తరువాత  అమెరికా లోని దాదాపు14 పెద్ద నగరాలలో(ఆస్టిన్ ,San Francisco,బ్లూ మింగ్టన్ , చికాగో ,వాషింగ్టన్ ,ఫ్లోరిడా ,ఫిలడెల్ఫియా ,న్యూ జెర్సీ ,న్యూ యార్క్ etc  ) పూర్వ విద్యార్ది పరిషత్ నాయకులు,సంఘ పరివార్ మిత్రులు  ఏర్పాటు చేస్తున్న  వివిధ సమావేశంలో ప్రసంగించనున్నారు.

 
ఆ తరువాత సెప్టెంబర్ 28 న  న్యూయార్క్ లో ఘనంగా జరుగనున ప్రధాని నరేంద్ర మోడీ గారి సభలో శేఖర్ జి  పాల్గొని తిరిగి డల్లాస్ చేరుకొని అక్కడ అక్టోబర్ 2 నమహాత్మా గాంధీ జయంతి సందర్భముగా అమెరికా లో భారతీయ అమెరికా మిత్ర మండలి ఆద్వర్యం లో  తాన మాజీ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ నిర్వహణలోథామస్ జెఫెర్సన్ పార్క్ లో  మొదటి మహాత్మాగాంధీ చారిత్రాత్మక  విగ్రహ ఆవిష్కరణ మరియు బహిరంగ సభ కార్యక్రమం లో అతిధి గా పాల్గొని  Oct  3 నడల్లాస్ నుంచి భారత్ కు బయలుదేరుతారు.   


వీరి పర్యటన కు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రవాస విద్యార్ది పరిషత్  పూర్వ విద్యార్దులు మరియు సంఘ పరివార్ కు చెందిన  మిత్రులు చిల్లకూరు  గోపి రెడ్డి ,సురేష్ మండువ ,కలవల అజయ్ ,జంబుల విలాస్ రెడ్డి  ,పార్థ సారధి ,యుగంధర్ రెడ్డి ,కొంపల్లి శ్రీనివాస్ ,నీరవ్ పటేల్ ,కలవల విశ్వేశ్వర్ , శరత్ ,అర్జున్ ,ఆదాల మురళి ,మేరెడ్డి రవి ప్రకాష్ ,పేరాల సునీల్, భద్రినాథ్ లు అమెరికా లో వివిధ నగరాలలో  ఏర్పాట్లు చూస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;