RELATED NEWS
NEWS
బిజినెస్ రంగంలో తానా ఎక్సెలెన్సీ అవార్డ్ అందుకున్న వల్లేపల్లి శశికాంత్‌

 

తానా 22వ మహాసభల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తానా కమిటీ ఎంపిక చేసిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లెజెండ్రీ క్రికెటర్ కపిల్‌దేవ్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించారు. అయితే బిజినెస్ ఎంటర్ప్రేన్యుయర్షిప్ రంగానికి సంబందించి వల్లేపల్లి శశికాంత్‌ కి ఆ అవార్డు దక్కింది. ఆయన అమెరికాలో స్థిర పడ్డ తెలుగువారందరికీ దాదాపు సుపరిచితులే, బోస్టన్ లో స్థిరపడిన ఆయన బోస్టన్ తెలుగు సంఘం, సిల్వర్ జూబ్లీ, అలాగే ముప్పై ఏళ్ల వార్షికోత్సవాలలో కీలక పాత్ర పోషించారు.

ఇక ఆయన తన పేరిట కాంత్‌ ఫౌండేషన్‌ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ సంస్థద్వారా ఏపీ తెలంగాణాల్లో గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు బసవతారక క్యాన్సర్‌ ఆస్పత్రి సహకారంతో ప్రతినియోజకవర్గంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ అందుకు అవసరమైన వ్యయాన్ని భరిస్తున్నారు. ఇక ఆయన 2017 - 2021 వరకూ తానా ఫౌండేషన్‌ ట్రస్టీగా సేవలు అందించనున్నారు. అంతే కాక గత సంవత్సరం గ్రేటర్ బోస్టన్ రేలుగు సంఘానికి చైర్మన్ గా బాద్యతలు నిర్వర్తించారు.

 

ప్రస్తుతం ఆయన క్వాలిటీ మాట్రిక్స్ టెస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఫౌండర్ అండ్ సీఈవోగా ఉన్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో ఆయనతో పాటు వివిధ రంగాలకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో తానా సభల కన్వీనర్‌ డా.మూల్పూరి వెంకటరావు, అవార్డుల కమిటీ చైర్మన్‌ శీలమనేని గోపాల్‌, కరుసాల సుబ్బారావులు కూడా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;