RELATED NEWS
NEWS
ఉత్తరాఖండ్ కు దుబాయ్ తెలుగువారు 2లక్షల విరాళం

 

డాక్టర్ పట్టాభిరాంతో ముఖాముఖిలో ఉత్తరాఖండ్ కు దుబాయ్ తెలుగువారి 2లక్షల విరాళం

 

 

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మైండ్ మెజీషియన్ డాక్టర్ బీ వీ పట్టాభిరాం దుబాయ్ పర్యటన లో భాగంగా, ఇక్కడ తెలుగువారితో ఒక సాయంత్రపు ముఖాముఖి సమావేఅశం లో పాల్గొని, దుబాయ్,షార్జా,అబుదాబిలోని తెలుగు వారితో ముఖాముఖి మాట్లాడారు. గల్ఫాంధ్ర ఈవెంట్స్ నిర్వహణ లో జరిగిన ఈ కార్యక్రమంలో, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు - కమ్యూనికేషన్ ల గురించి 'హ్యాపీ ఫ్యామిలీ' అనే అంశం పై ఉపన్యాసమిచ్చారు. మ్యాజిక్ మిళితం చేసి,అద్భుతమైన ప్రెసెంటేషన్లతో పట్టాభిరాం గారు అందరినీ మోటివేట్ చేసినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త,టెక్నోఫ్యాబ్, గల్ఫాంధ్ర ఈవెంట్స్ అధినేత కేసరి త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

ఈ కార్యక్రమంలో 'ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం' చేసిన ప్రకటనకు స్పందించి దాదాపు 2 లక్షల రూపాయల విరాళాలు అందించారు. త్వరలో మరికొంత మంది దాతల సహాయంతో మరింత సహాయాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి కి కేంద్ర మంత్రి డాక్టర్, పద్మభూషణ్ చిరంజీవి ద్వార అందిస్తామని నిర్వాహకులు కేసరి త్రిమూర్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎస్ ఎస్ రాజు గరు,మనోహర్,శ్రీరాం,గణేష్,శేకర్ రెడ్డి , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరాళాలు అందించిన ప్రముఖులకు డాక్టర్ బీ వీ పట్టాభిరాం గారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమ రూపకర్త ఫణిమాధవ్ కస్తూరి కి ధన్యవాదాలు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;