RELATED NEWS
NEWS
న్యూజెర్సీ లో విజయవంతంగా ముగిసిన లోక్ సత్తా సదస్సు

 

 

 

అమెరికా లోని లోక్ సత్తా మద్దత్తుదారుల సంస్థ అయిన "పీపుల్ ఫర్ లోక్సత్త " ఆధ్వర్యం లో జరిగిన పీపుల్ ఫర్ లోక్సత్త మొట్ట మొదటి కన్వెన్షన్ న్యూజెర్సీ నగరం లో జరిగింది ,ఇందుకోసం అమెరికా లోని 10 రాష్ట్రాలకి చెందినా దాదాపు 70 మంది ప్రతినిధులు కన్వెన్షన్ కి విచ్చేసారు. ఇందులో భాగంగా మొదటి రోజు " రివైవింగ్ సోషల్ లెగసి" అనే అంశం మీద భారత సంతతి విద్యార్థులకి వక్తృత్వ పోటీలు నిర్వహించారు ...ఈ కార్యక్రమానికి అమెరికాలో తెలుగువాళ్ళందరికి సుపరిచితుడైన రాజకీయవేత్త ,న్యూజెర్సీ అసెంబ్లీ ప్రతినిధి ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు .


ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లోని పేదకుటుంబం  నుండి చెన్నై గుండి కాలేజీ వారకి అక్కడినుండి  అమెరికా వరకు ఎంత కష్టపడి చదివి పైకి వచ్చిన తరువాత తన చుట్టూ ఉన్న సమాజం నాది అన్న బాధ్యతతో ,సామజిక సేవకి  రాజకీయాలని ఎంచుకున్నానని తెలిపారు ,ఎన్నో ఒడిదుడుకుల తర్వుత తానీ స్థాయికి వచ్చానని ,నిరతర కృషి,నిబద్దత,నిజాయితీగా పని చెయ్యడం వలన ఇది  అందరికి సాధ్యం అవుతుందని అయన తెలిపారు ,కానీ నేటి తరం  ని చూస్తుంటే వాళ్ళ సామజిక అవగాహనా ,సేవాభావం చిన్నవయసు నుండే పెంపొందించు కోవడం సమాజం దేశ అభివృద్ధి కి చాల దోహద పడుతుందని తెలిపారు.  పీపుల్ ఫర్ లోక్సత్త  నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన  రజని  మాట్లాడుతూ మన సమాజం,పరిసరాలు  అన్ని కూడా రాజకీయాల వల్లనే మెరుగవుతాయని ,రాజకీయాల్ని ద్వేశించుకోకుండా,రాజకీయాల్ని గురించు  నిశితంగా పరిశీలించాలి   ,రాజకీయాల గురించి చర్చికోవాలని తెలిపారు  ,ముఖ్యంగా యువత రాజకీయాల్ని గురించి పట్టించుకోవాలని తెలిపారు ..సభని సురేష్  eediga సమన్వయపరిచారు.


మద్దతుదారుల పరిచయం తరువాత లోక్సత్త లో ప్రస్తుతం జరుగుతున్నా  సంస్థగత ఎన్నికలు గురించి చర్చినుకున్నారు ,ఆ తర్వత  పీపుల్ ఫర్ లోక్సత్త మీడియా అధికార ప్రతినిధి దినేష్ పగడాల మరియు శ్రీకాంత్ కోచార్లకోట ఆధ్వర్యం లో పీపుల్ ఫర్ లోక్సత్త కి చెందినా వీడియో లను  ప్రదర్శించారు ,ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్ ద్వార సమాచార విప్లవం ఎలా పెరుగుతుంది మరియు  వాటిద్వార ఎలా  వేగంగా ప్రజలని చేరుకోవాచు అన్నది తెలిపారు  లోక్సత్త కి అందించవలసిన మీడియా సహాయాన్ని  కూడా తెలిపారు.ఆ తరువాత లోక్సత్త అభివృద్దికి చేయాల్సిన అంశాలని సభ్యులు చర్చించారు , లోక్సత్త భావజాలం ని  ఇంకా బాగా ప్రవాసాంధ్రుల లోకి తీసుకెళ్ళి ప్రజలని చైతన్య పరచి లోక్సత్త కి అమెరికాలో ఇంకా మద్దత్తు కూడా గట్టల్సిన అవసరం ఉంది అన్నారు తదనుగుణంగా అచరించవలసిన కార్యాచరణ ప్రణాళికల పై చర్చించారు.ఆ తర్వత  సందీప్ పట్టెం తానూ రూపొందించిన  constituency promotion  ప్రాజెక్ట్ గురించి వివరించారు ప్రస్తుతం నాలుగు నియోజక  వర్గాలకి   నలభై  మంది ఎన్నారై లు సహాయం అందిస్తున్నారని చెప్పారు.


రాయదుర్గం ,వైజాగ్ గురించి  ప్రకాష్ కపిల,సనత్ నగర్ పై ప్రదీప్ మరియు మల్కాజ్గిరి పై స్రవంతి యలమంచిలి  ఒక నివేదిక అందించారు. ప్రస్తుత రాజకీయాల్లో నిధుల అవసరాన్ని ఉందని నీతిమయ పార్టీలకి డబ్బు ఇవ్వడం తమ ధర్మంగా ప్రజలు ఆలోచించాలని తెలుపుతూ గల మార్గాలని  వివరించారు శ్రీకాంత్ ,మానస ,శ్రీనివాస్ గొల్లపల్లి కూడా నిధులని సమీకరించడానికి  అవసరమైన కొన్ని మార్గాలని తెలిపారు.పీపుల్ ఫర్ లోక్సత్త నుండి లోక్సత్త పార్టీ కి పూర్తిగా పని చేస్తున్న హైమా ప్రవీణ్ ,దిలీప్ శంకర్ రెడ్డి , పద్మ భూపతిరాజు  లకి సభ్యులు తమ పూర్తి మద్దత్తు నిచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు ,హైమా ,పద్మ మరియు శంతలదమలె ల స్ఫూర్తి తో తానూ త్వరలో భారత దేశం వెళ్లి  లోక్సత్త కి  పనిచెయ్యాలని అనుకుంటున్నట్లు 24 సంవత్సరాల బ్రాహ్మణి  బొప్పూడి తెలిపారు . కార్యక్రంగా లో భాగం గా చివరగా యువత సదస్సు జరిగింది ఇందులో భాగంగా 35 ఎల్లా లోపు   యువతని ప్రభావితం చేస్తున్న వివిధ రాజకీయంశాలపై చర్చించారు కృష్ణ బూరుగుపల్లి మాట్లాడుతూ యువత కి అసలు సిసలు ప్రాధాన్యం ఇచ్చేది లోక్సత్త మాత్రమే అని తెలిపారు ,గత రెండేళ్ళ నుండి పలు  పీపుల్ ఫర్ లోక్సత్త కార్య క్రమాల్లో పాలుపంచుకుఓటూ శ్రమకూర్చిన 20 మంది  సభ్యులకి సర్టిఫికెట్స్ ప్రధానం చేసారు ,సభ్యులు అంత మరింత పట్టుదల తో పనిచేస్తామని తెలిపారు.పీపుల్ ఫర్ లోక్సత్త  ప్రస్తుత అధ్యక్షకుడు.సంస్థ foundation member   అయిన ప్రసన్న మేధా, దండి మార్చ్ 2 రూపకర్త జవహర్ మరియు సంస్థ లో కీలక సభ్యుడు అయిన రాఘవ రెడ్డి సోలిపురం కు సభ్యులు   ఇచ్చారు .ఆ తర్వాత ఎంతో శ్రమ కూర్చి రెండు రోజులు కన్వెన్షన్ కోసం  ఏర్పాట్లు చేసి విజయవంతం చేసిన న్యూజెర్సీ టీం కి సభ్యులు అంతా కరతలధ్వనులతో కృతజ్ఞతలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;