RELATED NEWS
NEWS
డాలస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా

డాలస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా

డాలస్, టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్ లో నెలకొనిఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగాశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ కు స్వాగతం పల్కుతూ, భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21 నే గాక, నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమని, యోగావల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని తెలియజేస్తూ, యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అసీం మహాజన్ భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని, ప్రతి రోజూ యోగాచెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్ కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;