RELATED NEWS
NEWS
హెల్త్ కేర్ లీడర్షిప్-2013 పురస్కారాన్ని అందుకున్న MDconferencefinder.com

 

న్యూ ఓర్లండ్స్, లాస్ ఏంజిల్స్- నవంబర్ 6,3013 న జరిగిన 17వ హెల్త్ కేర్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో వైద్యఆరోగ్యరంగాలలో వివిధరకాల సేవలను అందిస్తున్న సంస్థలకు అవార్డులు ఇవ్వడం జరిగింది.


ఇందులో MD.కాన్ఫరెన్స్ ఫైండర్ సంస్థకు ఫిజీషియన్లకు, క్లినికల్ రంగానికి సంబంధించిన వెబ్సైట్ల కేటగిరీలో ఉత్తమ వెబ్సైట్ డిజైన్ గా ఎంపిక అయ్యింది. ఈ ముఖ్యమైన అవార్డుని అందుకున్న సందర్భంగా CEO ప్రియ కొర్రపాటి మాట్లాడుతూ "కాన్ఫరెన్స్ ఫైండర్ సంస్థ ఫిజీషియన్ల అవసరాలకు అనుగుణమైన వేదికను కల్పించి, వారి అవసరాలను తీర్చడంలోనూ, వారికి అనువైన మెడికల్ సదస్సుల వివరాలను అందించడానికి, వారిని ఎంపవర్ చేసే దిశగా సేవలు అందిస్తుందని." తెలిపారు.ఈ సంవత్సరం ఈ-హెల్త్ కేర్ లీడర్షిప్ అవార్డులకు అత్యంత భారీ స్పందన లభించింది. పద్నాలుగు కేటగిరీలలో దాదాపు పదకొండువందల ఎంట్రీలు వచ్చాయి. వైద్య,ఆరోగ్యరంగానికి సంబంధించిన వివిధ వెబ్సైట్లు, డిజిటల్ మీడియా సేవలు, ఆన్-లైన్ వైద్యసేవా సంస్థలు, హాస్పిటళ్ళు, హెల్త్ నెట్వర్కులకు సంబంధించిన ఉత్తమ సేవలకుగానీ ఈ అవార్డులు ప్రదానం చెయ్యబడతాయి. వైద్యాఅరోగ్య రంగంలో ఇంటర్నెట్ తాలూకు ప్రభావం, విశిష్టత, ఉపయోగాన్ని సెలెబ్రేట్ చేసుకోవడం కూడా ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.


 

MD కాన్ఫరెన్స్ ఫైండర్ వైద్యులకు సంబంధించిన వివిధ మెడికల్ కాన్ఫరెన్సులకి సంబంధించిన సమాచారాన్ని సరైన సమయంలో అందించే ఒక విభిన్నమైన వెబ్ సైట్. CME క్రెడిట్స్, సెంటర్లు, బోర్డ్ పరీక్షల ప్రిపరేషన్ కి సంబంధించిన విలువైన సమాచారం అందించే సైట్ ఇది. 2013 సంవత్సరంలోనే దాదాపు 5000 మెడికల్ కాన్ఫరెన్సులకి సంబంధించిన సమాచారాన్ని అందించిన ఏకైన వెబ్సైట్ ఇదే.

TeluguOne For Your Business
About TeluguOne
;