RELATED NEWS
NEWS
అమెరికాలో 8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవం


అమెరికాలో జూన్ 6 నుండి 28, 2015 వరకూ పదకొండు నగరాలలో 8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవం అందరూ ఆహ్వానితులే అందరినీ మీ తరఫున కూడా ఆత్మీయంగా ఆహ్వానించండి.

 

 

అమెరికా అంతటా వేలాది ఆహూతుల ప్రశంసలను అందుకుంటున్న మా ఉత్తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ అలనాటి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు  గారి మధుర గీతాలు, ఈ నాటి గాన గంధర్వుడు ఎస్.పి, బాల సుబ్రహ్మణ్యం గారి  అపూర్వ గానామృతాన్ని మేళవించి సామాజిక సేవాభావంతో  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రూపొందించిన అద్వితీయ సినీ గీతాల కార్యక్రమాల పరంపర రాబోయే జూన్ నెలలో ఎనిమిదవ సారి ప్రారంభం అవుతుంది. స్థానిక తెలుగు సంస్థల అద్వితీయమైన సహకారంతో అమెరికాలో పదకొండు నగరాలలో జరిగే ఈ ఏడు జరుగుతున్న ఈ తొలి విడత ఉచిత సంగీత విభావరికి అందరూ ఆహ్వానితులే. భారత దేశం నుంచి “అపర ఘంటసాల”  శ్రీ తాతా బాల కామేశ్వర రావు (హైదరాబాద్), తొలి అమెరికా పర్యటన లో “స్వరనిధి” శ్రీ పి.వి. రమణ (కాకినాడ), హ్యూస్టన్ నివాసి “గాన రత్న” శ్రీమతి శారదా ఆకునూరి ప్రధాన గాయకులుగా అమెరికా లో అసంఖ్యాకమైన  శ్రోతలకి వీనుల విందు చేయనున్నారు.


హైదరాబాద్ లోని వేగేశ్న ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని వికలాంగ బాల బాలిక సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం విరాళాల సేకరణ కోసం ఈ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.  1988 లో “శిరోమణి” శ్రీ వంశీ రామరాజు గారిచే సంస్థాపించబడి ఈ నాడు సుమారు 500 మంది అతి బీద వికలాంగ బాలబాలికలకి అంగ వైకల్య నిర్మూలనకి ఉచితంగా పూర్తి స్థాయి ఆపరేషన్స్,  వైద్యం, పదవ తరగతి వరకూ విద్య, బట్టలు, వసతి, వయోజన విద్య మొదలైన వాటి ద్వారా  తమ స్వశక్తితో వారు జీవనోపాధి సంపాదించుకునే పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ వేగేశ్న ఫౌండేషన్. వేగేశ్న సంస్థ వారి గత 27 సంవత్సరాల నిరవధిక సేవా ఫలితంగా సుమారు మూడు వేల బిచ్చమెత్తుకునే స్థాయి బీద వికలాంగ బాల బాలికలు పదవ తరగతి వరకూ చదువుకుని ఈ నాడు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతున్నారు. ఏడాదికి సుమారు 50 లక్షల రూపాయల ఖర్చు అవుతున్న ఈ స్వచ్చంద సామాజిక బాధ్యత కి  అత్యవసర నిధుల సేకరణ ద్వారా ఆయా సేవలని నిరంతరం కొనసాగించాలనేదే మా తపన.


అమెరికా లో ఈ క్రింది నగరాలలో, ఆయా తేదీలలో జరుగుతున్న “8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవం”, ప్రవేశ రుసుము లేని ఈ  అత్యున్నత స్థాయి సినీ సంగీత  కార్యక్రమానికి సకుటుంబ, సపరివారంగా వెళ్లి, మంచి తెలుగు పాటలు విని ఆనందించమని కోరుతున్నాం.


భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా జాతీయ సమన్వయ కర్త)
శారద ఆకునూరి (సమన్వయ కర్త)
వంశీ రామరాజు (అంతర్జాతీయ సమన్వయ కర్త, వేగేశ్న సంస్థ నిర్వాహకులు)

 

8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు  & 5 వ బాలూ సంగీతోత్సవం
(అమెరికా కార్యక్రమాల వివరాలు)1.      June 6, 2015 (Saturday): Los Angeles, CA

Contact: Sudheer Kota (949-892-9313, kotas369@yahoo.com)

2.      June 7, 2015 (Sunday) : Phoenix, AZ

Arizona Telugu association

Contact: Nataraj Bhadriraju & Venkat Kommineni

Phone:  6235611207, nateandminiaz@gmail.com)

----------------------------------------------------------------------------------------------

3.      June 12, 2015 (Friday ) : Albany, NY

           Albany Telugu Association


Contact: Rami Reddy Muppidi (Phone: 518 253 4535)

Srinivas Arvapally (Srinivasarvapally72@gmail.com)


----------------------------------------------------------------------------------------------

4.      June 13, 2015 (Saturday) : Edison, NJ

Telugu Fine Arts Society, NJ


Prabha Raghunadhan (908 234 2546, prabharaghunathan@hotmail.com)

-----------------------------------------------------------------------------------------------

5.      June 14, 2015 (Sunday): Floral Park, NY

“Sruti –Laya” Association


Srinath Jonnavittula (sreenadh@jonnavithula.com), Phone: 631 629 5843)

-----------------------------------------------------------------------------------------------

6.      June 19, 2015 (Friday) Raleigh, NC

Traingle Area Telugu Association (TATA)

Contact: Srinivas Aremanda (919 622 7080, srinivas.aremanda@gmail.com)

Prasad Kommaraju (919 971 7118)

-----------------------------------------------------------------------------------------------

7.      June 20, 2015 (Saturday): Atlanta, GA

TAMA, GATA, Kuchipudi Art Academy & Amruthavarshini


Contact: Dr. B.K.Mohan (678 614 7533, rajabmohan@hotmail.com)

-----------------------------------------------------------------------------------------------

8.      June  21, 2015 (Sunday): San Antonio, TX

Telugu Association of San Antonio

Contact: Ravi Botla (ravibotla@yahoo.com)

----------------------------------------------------------------------------------------------

9.      June  26, 2015 (Friday): Houston, TX

Telugu Cultural Association & Vanguri Foundation of America,

Sarada Akunuri (Phone: 281 235 4334, sarada_houston@yahoo.com)

Raj Pasala (President, TCA): Phone 646 265 5600


-----------------------------------------------------------------------------------------------

10.  June 27, 2015 (Saturday): Austin, TX

Telugu Cultural Association, Austin, TX

Sangameswar Reddigari (Phone: 703 485 6626)

-----------------------------------------------------------------------------------------------

11.  June 28, 2015 (Sunday): Dallas, TX

Telugu Association of North Texas


Narasimha Reddy Urimindi (Phone: 972 523 3029, reddyu@gmail.com)

TeluguOne For Your Business
About TeluguOne
;