RELATED NEWS
NEWS
న్యూజెర్సీలో బీజేపీ కార్యకర్తల మీట్ అండ్ గ్రీట్

 

న్యూజెర్సీలో బీజేపీ కార్యకర్తల మీట్ అండ్ గ్రీట్


అమెరికాలోని న్యూజెర్సీలో బీజేపీ కార్యకర్తలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి గడ్కరీ మాట్లాడారు. అమెరికా ఈ రోజు అగ్రరాజ్యంగా, గొప్పదేశంగా ఉందంటే దానికి కారణం రవాణా వ్యవస్థ బాగుండటమేనన్నారు. భారత్‌లో కూడా మెరుగైన రవాణా వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రోజుకి 20 కిలోమీటర్ల జాతీయ రహదారి వేస్తున్నామని..అదే కాంగ్రెస్ హయాంలో రోజుకి రెండు కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే వేసేవారన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులపై సంతకాలు చేశామని తెలిపారు. ప్రస్తుతం భారత్ అంతర్గతంగా అభివృద్ధి చెందుతోందని..దానితో పాటు చాలా దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ప్రెసిడెంట్ -ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్  బిజెపి ), జయేష్ పటేల్ , రఘు రెడ్డి , అరవింద్ మొదిని, విలాస్‌రెడ్డి జంబుల (యూత్ కో -కన్వెనోర్ - ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్  బిజెపి),  వినోద్ కోడూరు , సురేష్ , రామ్ వేముల , శ్రీకాంత్ ,  హేమచంద్ర,  ఆనంద్ జైన్ , ఆర్పీ సింగ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;