RELATED NEWS
NEWS
"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్రాన్ని, అమెరికాలో ఆవిష్కరించిన డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి





"చరిత్రకే ఒక్కడు " పుస్తక ముఖ చిత్రాన్ని, అట్లాంటా మహానగరం లో, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల ఉడుముల ఆధ్వర్యములో, ప్రముఖ తెలుగు సామాజిక నాయకులు డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ సంజీవ రెడ్డి , డాక్టర్ హరనాథ్ పొలిచర్ల ఆవిష్కరించారు.


డాక్టర్ ప్రేమ రెడ్డి  మాట్లాడుతూ , "నా  మిత్రుడు , రాజనీతిజ్ఞుడు  డాక్టర్  వైఎస్  రాజశేఖర రెడ్డి  జీవిత చరిత్ర ” చరిత్రకే ఒక్కడు“  పుస్తక రూపం లోకి , తీసుకు వస్తున్నందుకు , వేణుగోపాల ఉడుముల మరియు పుస్తక రచయత కరణ్ రెడ్డి ని అభినందిస్తున్నానని చెప్పారు.







డాక్టర్ మల్లా రెడ్డి మాట్లాడుతూ  "నా  మిత్రుడు, మహా నాయకుడు   డాక్టర్  వై  ఎస్  రాజశేఖర రెడ్డి  జీవిత చరిత్ర  " చరిత్రకే ఒక్కడు“ పుస్తక విశేషాలు, ఆసక్తికరము గా ఉన్నాయని చెప్పారు.



డాక్టర్ సంజీవ రెడ్డి  మాట్లాడుతూ  "తెలుగు వాళ్లకు, డాక్టర్  వైఎస్  రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మరువలేరని"  చెప్పారు.



డాక్టర్ హరనాథ్ పొలిచర్ల మాట్లాడుతూ " డాక్టర్  వైఎస్ రాజశేఖర రెడ్డి,  ప్రవాసాంధ్రులతో కలిగిన, స్నేహము, అనుబంధము మరువలేనిదని " చెప్పారు.





వేణుగోపాల  ఉడుముల , ప్రవాసాంధ్ర   పాత్రికేయుడు మాట్లాడుతూ " చరిత్రకే ఒక్కడు“ పుస్తకము, కోసము  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న   డాక్టర్  వైఎస్  రాజశేఖర రెడ్డి   అభిమానులు, వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు . యువ రాజకీయ వేత్తలకు, ప్రజా సేవ చేయాలనుకొనే  వాళ్లకు,  ఈ పుస్తకము ఒక మహా గ్రంధమని   చెప్పారు.



డాక్టర్  వైఎస్  రాజశేఖర రెడ్డి  గారితో, తమతో గల అనుబంధాన్ని రాజేశ్వర్ రెడ్డి గంగసాని, మొండిఎద్దు వెంకట్, కిరణ్ కందుల, మోహన్ తలమాటి, వెంకట్ మేడపాటి, ఆళ్ళ రామి రెడ్డి ,చిన్న బాబు రెడ్డి , ప్రసంగము లో చెప్పారు.  



డాక్టర్  వైఎస్  రాజశేఖర రెడ్డి  జీవిత చరిత్ర ” చరిత్రకే ఒక్కడు“ఒక పుస్తక రూపం లో తీసుకురావాలనే పట్టుదలతో,   రచయత  చెరుకు కరణ్ రెడ్డి మరియు  ప్రవాసాంధ్ర   పాత్రికేయుడు, వేణుగోపాల ఉడుముల   సహకారము తో, డిసెంబర్  30వ తేది ,  ఈ అద్బుతమైన పుస్తకాన్ని  ప్రపంచ వ్యాప్తంగా,   హైదరాబాద్ లో మరియు  తెలుగు వాళ్ళున్న దేశాల్లో  విడుదల చేస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;