RELATED NEWS
NEWS
మోదీ ప్రభుత్వపు ౩వ వార్షికోత్సవ సంబరాలు


మోదీ  ప్రభుత్వపు ౩వ వార్షికోత్సవ సంబరాలు

 

 

 

ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  అద్వర్యంలో మోడీ ప్రభుత్వపు ౩వ వార్షికోత్సవ సంబరాలు, ఎడిసన్, న్యూ జెర్సీ లోని TV ఆసియ స్టూడియో లో ఘనంగా  జరిగాయి . ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ పదాధికారులు మరియు ఇతర సంఘాల  నాయకులు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు సభను ఉద్యేశించి మాట్లాడారు . మోదీ ప్రభుత్వము గడిచిన 3 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను క్లుప్తముగా వివరించారు . అలాగే భారతీయ జనతా పార్టీ గడిచిన 3 సంవత్సరాలలో సాధించిన ప్రగతి మరియు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగ ఎలా ఎదిగిందో వివరించారు .

 ఆ తరువాత సీమ సాబు గారు దేశ భక్తి గీతంతో సభకు విచ్చేసినటువంటి ప్రవాస భారతీయులను అలరించారు. ఆ తరువాత ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ జాతీయ యువ కో-కన్వీనర్, శ్రీ దీప్ భట్ గారు యువత మరియు నిరుద్యోగనికి సంబందించిన సమస్యలపై మోదీ ప్రభుత్వం చేసిన కృషిని మరియు సాధించిన ప్రగతిని వివరించారు. మహిళా సాధికారత కోసం మోదీ ప్రభుత్వము చేపట్టిన అనేక కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని గురించి శ్రీ కల్పన శుక్ల గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు, వివరించారు . అదేవిదంగా , దేశ ఆర్థిక వ్యవస్తలో మోదీ ప్రభుత్వము సాధించిన అనేక విజయాలను ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్ గారు , అలాగే ఇటీవల అమలు చేసిన GST ఒకేదేశం - ఒకేపన్ను గురించి  శ్రీ గుంజన్ మిశ్ర గారు వివరించారు.  ఆ తరువాత ఓఎఫ్ బిజెపీ మీడియా కో కన్వీనర్, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, దేశ రక్షణ విషయంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని మరియు సర్జికల్ స్ట్రయిక్స్ , వన్ రాంక్ వన్ పెన్షన్ (OROP) మరియు ఇతర దేశాలతో చేసుకొన్నా రక్షణ ఒప్పందాలు తదితర విషయాల గురించి తెలిపారు .

 


 
ఓఎఫ్ బిజెపీ, జాతీయ యువ కో-కన్వీనర్, శ్రీ విలాస్ జంబుల గారు గ్రామీణ భారత అభివృద్ధికి మోదీ ప్రభుత్వము చేపట్టుతున్న అనేక కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, విద్యుతికరణం, గ్రామీణ ఉపాధి, గ్రామీణ సంక్షేమ మరియు వేప పూత పూసిన యూరియా సరఫరా తదిర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్ గారు,  ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల గారు, బాలగురు గారు , కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీ నీలిమ మదన్ గారు, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కోఆర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్ గారు,  ఫైనాన్స్ కన్వీనర్ ఆత్మసింగ్, ఓఎఫ్ బిజెపీ ఫిలడెల్ఫియా  కోఆర్డినేటర్ శ్రీ డా. సంజయ్ గుప్త గారు, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు  శ్రీ ఆనంద్ జైన్, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ మెంబర్షిప్ కన్వీనర్ శ్రీ ప్రమోద్ భగత్ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల , శ్రీ దీప్ భట్  గార్లు, , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్, మరియు ఇతర  ఓఎఫ్ బిజెపీ నేతలు గుంజన్ మిశ్ర, ప్రదీప్ రెడ్డి గార్ల తో పటు  చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;