RELATED NEWS
NEWS
తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ ఆవిర్భావం

 



TECA తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ - కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం  యూరప్ లో ఉన్న తెలంగాణ ప్రజల సహకారం తో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని పరిరక్షిస్తూ, తెలంగాణ జాగృతి కోసం పాటుపడే యూరోప్ లోని సాంస్కృతిక సంస్థ గా  టేఛా తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ ఆవిర్భవించింది అని టెఖా కోర్ కమిటీ సభ్యులు శేషేంద్ర శేషభట్టర్ తెలిపారు.

 



యూరోప్, మరియు అనుబంధిత దేశాలలో, తెలగాణ సాహిత్యం,కళలు,సంస్కృతి, చారిత్రక వైభవం  గురించి  ఎలుగెత్తి చాటి చెప్పి తెలంగాణ గొంతుక వినిపించి బంగారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేయడమే మా ధ్యేయం.మా కార్యాచరణ కోసం, మాతో కలిసి పని చేయడం కోసం,మా గురించి తెలుసుకోవడం కోసం www.te-ca.com లేదా మా ఫేస్ బుక్ పేజ్ సంప్రదించవచ్చు అని విష్ణు వర్ధన్ తాటిషెట్టి ప్రకటించారు.

 



మన తెలంగాణ యొక్క సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశం లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దిద్దడానికి ముందుకు రావలసిందిగా యూరోప్ లోని తెలంగాణా సోదరులందరికీ స్వాగతం పలుకుతూ అందరం కలిసి బంగారు తెలంగాణ కలను నిజం చేద్దాం అని టెకా ప్రారంభోత్సవ సందర్భంగా TECA కోర్ కమిటీ సభ్యులు  క్రాంతి రామిషెట్టి తెలిపారు.రానున్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవం గా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;