RELATED NEWS
NEWS
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 నూతన కార్యవర్గం

 

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 నూతన కార్యవర్గం


 

పద్మవిభూషణ్, నటసామ్రాట్ డాక్టర్. అక్కినేని నాగేశ్వర రావు గారి అభిమానులు కొంతమంది కలిసి 2014 లో అమెరికా లో స్థాపించిన లాభాపేక్షరహిత సంస్థ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ). ఈ బోర్డు సభ్యులు అక్కినేని నాల్గవ వర్ధంతి సందర్భంగా  అమెరికాలో సమావేశమై 2018వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. నూతన కార్యవర్గం --
 

వ్యవస్థాపక అధ్యక్షులు – డా. ప్రసాద్ తోటకూర

అధ్యక్షులు -- రావు కల్వల

ఉపాధ్యక్షులు -- శారద ఆకునూరి

కార్యదర్శి -- చలపతి రావు కొండ్రకుంట

బోర్డు సభ్యులు - రవి కొండబోలు, ధామ భక్తవత్సలు, డా. సి. ఆర్. రావు, మురళి వెన్నం, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి.
 

ఆ సమావేశంలో డా. ఏ. ఎన్. ఆర్ తో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాల్ని, అనుభవాల్ని బోర్డు సభ్యులు నెమరవేసుకున్నారు. ముఖ్యంగా 2012 లో డా. అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికాలో జరిపిన చివరి పర్యటన, డాలస్ నగరంలో అత్యంత వైభవంగా 89వ జన్మదిన వేడుకలను, ఆయన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆక్కినేని నాల్గవ అంతర్జాతీయ పురస్కార వేడుకలు గత నెల డిసెంబర్ 16న ఏలూరులో ఎంతో ఘనంగా జరగడానికి సహకరించిన వారందరకీ ఏ.ఎఫ్.ఏ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. 

“అక్కినేని 5వ అంతర్జాతీయ పురస్కార వేడుక”లను ఈ సంవత్సరం డిసెంబర్ 22న కరీంనగర్ నగరంలో జరుపనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు రావు కల్వల వెల్లడించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;