RELATED NEWS
NEWS
Parliamenteriyan of Canada Deepika Damerla

ఒంటారియో పార్లమెంటులో హైదరాబాదీ

లిబరల్ పార్టీ అభ్యర్థిగా దీపిక దామెర్ల విజయం

పార్లమెంటులో భవద్గీతపై ప్రమాణం

 

'ఓ ప్రణాళిక, పకడ్బందీ కార్యాచరణ.. వీటికి తోడు ఆత్మీయులంతా సహకరిస్తే.. అద్భుతాలు సృస్టించవచ్చు. అసాధ్యమనేది లేదని నిరూపించవచ్చు. అందుకు ఈమె సాక్షి. శ్రమ, పట్టుదల అనే ఆయుధంతో అందదని భావించే అందలాన్ని సైతం అధిరోహించవచ్చన్న విజయసూత్రానికి దీపిక జీవితమే నిదర్శనం'. ఒంటారియ (కెనడా) రాష్ట్రంలోని మిస్సిసాగా స్థానం నుంచి మెంబర్ ఆఫ్ ప్రొవెన్షియల్ పార్లమెంట్ (ఎంపీపీ) గా ఎన్నికైనా తొలి హైదరాబాదీ దీపిక దామెర్ల. తాను ఈ స్థానానికి వెళ్లేందుకు తల్లిదండ్రులు, వెన్నంటి ప్రోత్సహించిన బంధువులతో పాటు నా జన్మభూమికి ఎల్లప్పుడు ఋణపడి ఉంటానని దీపిక దామెర్ల చెప్పారు. గత నెల 27న మిస్సీసాగా ఎంపీపీగా భవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన దీపిక ఆన్ లైన్ లో తన హైదరాబాద్ అనుబంధాన్ని నెమరేసుకున్నారు. త్వరలోనే హైదరాబాద్ - పూణెలకు వచ్చి ఆత్మీయులను కలుస్తానన్నారు.

 

 

తొలి అడుగు ఇక్కడి నుంచే...

కంటోన్మెంట్ మిలట్రీ ఆస్పత్రిలో నవంబర్ 21, 1966లో పుట్టిన దీపిక తన ప్రైమరీ ఎడ్యుకేషన్ ను తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో చదివారు. ఆర్మీలో పనిచేసే తండ్రి దామెర్ల వెంకటరమణారావు బదిలీ రీత్యా గ్వాలియర్ లోని సింధియా విద్యాలయం, పూణెలోని నెస్ వాడియా కళాశాలలో బీకాం, పండిట్ కళాశాలలో సిఎను కంప్లీట్ చేశారు. కెనడాలో స్థిరపడ్డ కుమార్ చెర్లతో వివాహానంతరం టొరంటో యూనివర్సిటీలో ఎం బీఏ చేశారు. ఆపై రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాలో కార్పోరేట్ అకౌంటెంట్ గా పనిచేసి, సమాజ సేవ కోసం 'ఓమ్నీ' టీవీలో సోషల్ అండ్ పొలిటికల్ కామెంటేటర్, రిపోర్టర్ గా చేరారు. ఈ సమయంలో మిస్సీసాగా ప్రాంతంలోనే అనేక సమస్యలను ఎత్తి చూపుతూ వాటికి పరిష్కారం చూపించగలిగారు. అదే సమయంలో ఒంటారియో ఆర్థికశాఖ మంత్రికి సలహాదారుగా కూడా పనిచేసి రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. ప్రస్తుతం దీపిక తల్లిదండ్రులు పూణెలో ఉండగా, ఆమె సమీప బంధువులంతా కంటోన్మెంట్ గన్ రాక్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు.

 

అధిక మెజారిటీతో...

దీపిక గత మాసంలో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ అభ్యర్థిగా మిస్సీసాగా స్థానం నుంచి పోటీ చేసి 15,450 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి కన్స ర్వేటివ్ అభ్యర్థి చర్చిన్ పై 4161 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్టోబర్ 27న ఆమె మెంబర్ ఆఫ్ ప్రొవిన్షియల్ పార్లమెంటు బాధ్యతలు చేపట్టారు.

TeluguOne For Your Business
About TeluguOne
;