RELATED NEWS
NEWS
డల్లాస్ ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

 

అమెరికా తెలుగుజాతిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ డాలస్ అంగరంగవైభవంగా బాలల సంబరాలు నిర్వహించింది..నెహ్రుజయంతి వేడుకల సందర్భంగా ప్రతి యేటా నవంబర్ లో బాలల సంబరాలను నాట్స్ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగానే ఇటీవల నాట్స్ తెలుగు సంబరాలు ఘనంగా జరిగిన డాలస్ వేదికగా బాలల సంబరాలు జరిగాయి. బాలల్లో ప్రతిభను వెలికితీసేలా హైస్కూలు స్థాయి విద్యార్దులకు తెలుగులో ఆట, పాట, చదరంగంలో పోటీలు నిర్వహించారు.. దాదాపు 125 మంది చిన్నారులు ఈ బాలల సంబరాల పోటీల్లో పాల్గొన్నారు.


కూచిపూడి,జానపదం, పాటల పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.. అటు చదరంగంలోనూ తమ టాలెంట్ చూపెట్టారు.. బాలల ప్రతిభ ప్రదర్శనతో ఈ సంబరాలు ఆద్యంతం కన్నులపండువగా జరిగాయి. నాట్స్ తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించిన నాట్స్ డాలస్ టీం.. బాలల సంబరాలను కూడా గ్రాండ్ సక్సెస్ చేసింది. ప్రతికూల వాతావరణంలో కూడా దాదాపు 200 తెలుగు కుటుంబాలు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నాయి.. డాలస్ లో నాట్స్ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి మంచి స్పందన లభిస్తుందని... ఇదే తమలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని నాట్స్ డాలస్ టీం తెలిపింది. ఇక ముందు కూడా తెలుగువారి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని.. టీం నాయకులు చెప్పుకొచ్చారు. బాలల సంబరాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

TeluguOne For Your Business
About TeluguOne
;