RELATED NEWS
NEWS
తెలుగు కళా సమితి 30వ వార్షికోత్సవ సభల నిర్వహణకు విరాళాల వెల్లువ

 


అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో జులై 11వ తేదీన  జరిగే తెలుగు కళా సమితి 30వ వార్షికోత్సవ సభల నిర్వహణ కోసం ఏప్రిల్ 11న స్థానిక కొరియాండర్ ఉత్సవ ప్రాంగణంలో జరిగిన నిధుల సమీకరణోత్సవానికి అనూహ్య స్పందన లభించింది. శ్రీమతి కాశీనాధుని  రాధ గారి అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఒక్క రోజులోనే 38,000 డాలర్లను సమీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులను తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు   శ్రీ గురు ఆలంపల్లి  సాదరంగా  అహ్వానించారు. 

చిన్నారి విష్ణుప్రియ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమయింది.    వేదపండితుల మంత్రోచ్చారణతో జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని శ్రీ భావరాజు మూర్తి దంపతులు, శ్రీమతి కాశీనాధుని రాధ గారు, శ్రీమతి సత్యవేణి గారు, శ్రీమతి గిరిజా కొల్లూరి గారు, శ్రీ బండారు రాజారావు గారు తదితర పెద్దలు ప్రారంభించారు. అనంతరం ప్రముఖ వేదపండితులు శ్రీ రఘుశర్మ శంకరమంచి గారు తెలుగు కళా సమితి 30వ వార్షికోత్సవ సభలు విజయవంతంగా జరగాలని అశీర్వదించారు.  తెలుగు కళా సమితి అధ్యక్షులు  శ్రీ గండి శ్రీనివాస్ గారు ఈ 30వవార్షికోత్సవ సభలను ఏవిధంగా జరుపుతుందో  సభికులకు వివరించారు.  శ్రీమతి కాశీనాధుని  రాధ గారు చక్కటి వాక్చాతుర్యంతో  నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టగా, తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు  శ్రీ మధు అన్నా, శ్రీ మధు రాచకుళ్ళ, శ్రీమతి బిందు మాదిరాజు మరియు శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి  సభా ప్రాంగణమంతా
కలియతిరుగుతూ  వార్షికోత్సవ సభల ముఖ్యాంశాలను సభికులకు వివరించారు.

 

 

30వ వార్షికోత్సవ సభల లక్ష్యాలను వివరిస్తూ శ్రీ వంశీ కొప్పురావూరి రూపొందించిన లఘు చిత్రం సభికులను విశేషంగా  ఆకర్షించింది.    శ్రీ ప్రేమ్ నందివాడ ఒక్కరే 5000 డాలర్ల విరాళం ప్రకటించి తెలుగు కళా సమితి మీద తన అభిమానం తెలియచేసారు.     అనంతరం కోశాధికారి శ్రీ వసంత నాయుడు తన్నా గారు విరాళాలిచ్చిన  దాతలకు కృతజ్ణతలు తెలియచేసారు.    యువగాయకులు శ్రీకాంత్, హరిప్రసాద్, ఆశా యేలూరి, విష్ణుప్రియ మరియు క్రిష్ణకుమార్ దంపతులు మధుర గీతాలతో సభికులను అలరించారు.  ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి ప్రాంగణాన్ని సమకూర్చి, మంచి విందుభోజనం ఏర్పాటు చేసిన  శ్రీ దాము గేదెల  గారికి తెలుగు కళా సమితి కార్యవర్గం  ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసారు. కార్యదర్శి శ్రీమతి ఉమా మాకం వందన సమర్పణతో సభ ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;