వామ్మో బామ్మ.. 90 ఏళ్ల వయసులో ఆసనాలు..

  ఈరోజు అంతర్జాతీయ యోగా డే. ఈరోజు అందరూ యోగాసనాలు వేస్తూ యోగా డే ను జరుపుకుంటారు. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు ఆసనాలు చాలా తేలికగా వేసేయోచ్చు. అదే వయసు దాటిన తరువాత వేయాలంటే.. అసలు ఆ వయసులో మన పని మనకు చేసుకోవడానికే చాలా కష్టం.. అలాంటిది యోగాసనాలా అని అనుకుంటున్నారు. కానీ ఆ వయసులో కూడా యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నానమ్మాళ్ అనే భామ. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్- ఒక యోగా టీచర్. 93 ఏళ్ల వయసు. అయినా ఇప్పటికీ ఆమె శరీరాన్ని విల్లులా వంచుతుంది! నానమ్మాళ్ యోగాసనాలు వేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే! దాదాపు 50 రకాల ఆసనాలను ఈ వయసులో కూడా అవలీలగా వేసెయ్యగలదు. 20 వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటిదాకా ఆమె మందు బిళ్ల కూడా మింగలేదంటే నమ్మండి. అంత ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా నానమ్మాళ్ ఖ్యాతి గడించారు.

మధ్యలో నలిగిపోతున్న చంద్రబాబు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అభివృద్ధికి పడుతున్న పాట్లు చూస్తుంటే ఒక్క ముక్కలో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీని వృద్ది చేయడానికి ఆయన బాగానే కష్టపడుతున్నారు. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీలు లాంటివి ఇవ్వడం లేదు.. మరోవైపు ప్రతిపక్షాల గోల. ఇక ప్రతిపక్ష నేత జగన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. చంద్రబాబును ఏ పాయింట్ మీద విమర్శించాలా.. ఏ రచ్చ చేయాలా అని చూస్తుంటారు. చంద్రబాబు అంత రాజకీయానుభవం లేకపోయినప్పటికీ..యువనేత చేసే పనులు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగానే తయారయ్యాయి. ఇప్పుడు ముద్రగడ రూపంలో మరో తలనొప్పి.   ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో మరో పరిస్థితి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాని తెలంగాణలో పరిస్థితి వేరు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీదే ప్రస్తుతం హవా అక్కడ. ఏపీలోనే ఆయన ఎక్కువ గడుపుతుండటంతో.. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో నేతల్లో అసంతృప్తి నెలకొనడం.. పార్టీ మారడం. ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ నుండి ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలకు చేరిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మరో నేత కూడా పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ నేత ఎవరో కాదు.. నల్గొండ జిల్లా దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. దీంతో చంద్రబాబు మోత్కుపల్లి కూడా వెళ్లిపోతారేమో అని టెన్షన్ పడుతున్నారంట.   గత కొంత కాలంగా చంద్రబాబు మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తాననే చెబుతున్నారు. కానీ అది ఇంతవరకూ జరగలేదు. పోనీ.. అదికాకపోయినా రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు కేటాయించాలని కోరారట.. కానీ అదీ జరగలేదు. వచ్చిన మూడు సీట్లలో ఒకటి మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వగా.. ఏపీలో ఉన్న రాజకీయాల దృష్యా రెండు సీట్లు అక్కడివారికే కేటాయించారు. అయితే ఇకపై కేంద్రనుండి ఏ సీటు వచ్చినా అది తెలంగాణ టీడీపీకే ఇస్తానని చెప్పారంట. అనుకున్నట్టే టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చింది. అయితే ఈసారి కూడా బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కేంద్రం మంత్రి పదవి ఇస్తే కేంద్రం నిధుల విషయంలో మొండి చేయి చూపుతుందని.. మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే నిధుల కోసం గట్టిగా డిమాండ్‌ చేయవచ్చని అనుకుంటున్నారు.. మరోపక్క టీ టీడీపీకి పదవి ఇస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారో. అంతేకాదు మంత్రి పదవి వద్దని ఆయన గవర్నర్ పదవి అడగాలని.. పోస్ట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంట. ఈ పదవి కునుక దక్కి తెలంగాణ నేతలకు ఇస్తే చంద్రబాబును వారి నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు మోత్కుపల్లిని సంతోపెట్టగలరా..? లేదా..? అన్నది చూడాలి.

ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తే ఇక అంతే..

  తమిళనాడులో అమ్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బస్సులో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడో.. లేక బస్సులు లేవనో ఫుట్ బోర్టు పై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే చెప్పక్కర్లేదు.. ఒకవేళ బస్సులో ప్లేసు ఉన్నా ఫుట్ బోర్టు పై నిలబడటానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దీంతో దీన్ని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ, పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లను రద్దు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వలను విద్యాశాఖ నుంచి జారీ అయ్యాయి. గతంలో వీటిని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకున్నా.. వారికి రూ. 500 జరిమానా, తల్లిదంద్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, టీసీలు ఇచ్చి పంపడం వంటి చర్యలు చేపట్టినా, అది కొంతకాలానికే పరిమితమైందని.. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలుపుతోంది.

యోగాసనాలు వేస్తూ ఎంపీ నిరసన.. కేజ్రీవాల్ ఇంటి ముందు..

  ఈ రోజు ప్రపంచ రెండో యోగా డే. అందరూ ఆసనాలు వేస్తూ బిజీగా ఉంటే ఓ ఎంపీ మాత్రం ఆసనాలతో తన నిరసనను తెలుపుతున్నాడు. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఎందుకు నిరసనలు తెలుపుతున్నాడనే కదా డౌట్.. అసలు సంగతేంటంటే.. బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ పై ఢిల్లీ ముక్యమంత్రి కేజ్రీవాల్ ఓ హ‌త్య కేసులో తనపై ఆరోపణలు కురిపిస్తున్న నేపథ్యంలో ఆయన దీక్షకు దిగారు. గత రెండు రోజుల నుండి కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష చేస్తున్న ఆయన ఈరోజు యోగా డే సందర్బంగా.. వేదికపై యోగననాలు వేశారు. ఆయనతో పాటు ఆయనకు మద్దతు తెలుపుతున్న పలువురు నేతలు కూడా యోగాసనాలు వేస్తూ నిరసన తెలిపారు.

ముద్రగడ దీక్ష ఈ మాత్రం దానికేనా..?

  ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టి రోజులకు రోజులు గడుస్తున్నా ఫలితం మాత్రం ఎంటో ఎవ్వరికీ అర్ధంకావడంలేదు. గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా దిగివచ్చి.. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. వారికోసం ఓ కమిటీ కూడా వేస్తాం అని సర్దిచెప్పడంతో అప్పుడు దీక్ష విరమించారు. అయితే ఇప్పుడు ముద్రగడ దీక్ష చేపట్టి పది రోజుల పైన అవుతున్నా ప్రభుత్వం కూడా అడుగు ముందుకేయడం లేదు. ఏదో రెండు రోజులు హడావుడి చేసినా.. ఆతరువాత చేసుకుంటే చేసుకోండి అన్నట్టు వదిలేసింది. ఇక ముద్రగడ కూడా తాను మాత్రం దీక్ష విరమించేది లేదని చెబుతూ.. ఒకపక్క వైద్య పరీక్షలకు సహకరిస్తూ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఇంతా చేసి.. దీక్షా చేస్తున్న.. కొంతమంది మాత్రం ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో క్లారిటీ ఉందా..?లేదా..? అని అనుకుంటున్నారా. ఎందుకంటే. తుని కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే దీనిపై ముగ్గురికి బెయిల్ దొరికింది. ఇక మిగిలివారికి కూడా దొరకడం పెద్ద కష్టమేమి కాదు. నేపథ్యంలో ఇక ముద్రగడ దీక్ష విరమింపజేయవచ్చని కాపు సంఘాల నేతలే అన్నారు. దీనికి ముద్రగడ బెయిల్ దొరికిన ముగ్గురు బయటకు వచ్చాకే విరమించేది లేదు అన్నట్టు సమాచారం. అంటే దీన్నిబట్టి చూస్తే.. ముద్రగడ ఎంతో కష్టపడి ఇన్నిరోజులు దీక్ష చేసింది నిందితులు బెయిల్ మీద బయటకు రావడం కోసమా..? కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. విచారణలు విన్న తరువాత వారికి బెయిల్ ఇవ్వడం అయిపోతుంది.. దానికి ఓ రెండు రోజుల టైం పడుతుంది.. ఆ మాత్రం దానికి దీక్ష చేయడం అవసరమా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   ఇక్కడ ఇంకా సిల్లీ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటూ దీక్ష చేస్తున్న ముద్రగడకు అప్పుడప్పుడూ.. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. మరి ఆ మాత్రం ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఎన్నిరోజులైనా దీక్ష చేసేయోచ్చు. అందుకే ప్రభుత్వం కూడా చేసుకుంటే చేసుకోండిలే అని నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. మొత్తానికి ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రజలకు ఎలాగూ ఓ క్లారిటీ లేదు.. మరి ఆయనకన్నా ఓ క్లారిటీ ఉందో లేదో.. అసలు ఈ దీక్ష వల్ల ఆయన సాధించిందేంటో ఆయనకే తెలియాలి.

ట్రంప్ పై హత్యాయత్నం... ఊరుకుంటాడా..?

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అందరికి షాకులిచ్చే డొనాల్డ్ ట్రంప్ కే ఓ యువకుడు దిమ్మతిరిగే షాకిచ్చాడు. అతనిని చంపేదుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్ లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఆ ర్యాలిలో కాలిఫోర్నియాకు చెందిన మైకెల్ స్టాన్ ఫోర్డ్ (19) అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అంతలో సడెన్ గా సెక్యూరిటీగా ఉన్న ఓ పోలీసు వద్ద గన్ లాక్కుని ట్రంప్ ను కాల్చేందుకు ప్రయత్నించాడు. అంతే వెంటనే తేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. లాస్ వెగాస్ లో ట్రంప్ మిస్సయితే తరువాత ఫీనిక్స్ ప్రాంతంలో జరిగే ర్యాలీలో చంపేందుకు సిద్ధమైనట్టు చెప్పాడు. ట్రంప్ ను చంపేందుకు ఒక్కరోజు ముందే లాస్ వేగాస్ వచ్చానని.. గన్ కాల్చడం కూడా ఒక్క రోజులోనే నేర్చుకున్నానని చెప్పాడు.   అసలే ట్రంప్ కు చిన్న విషయం దొరికినా తన నోటికి పని చెప్పి ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు అతనిపైనే ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసిన తరువాత ఊరుకుంటాడా.. ఈ విషయంలో ఎవర్ని విమర్శిస్తాడో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.  

ప్రపంచ యోగా డే.. నేతల ఆసనాలు..

  ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంఢీగఢ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్ధులు.. కేంద్రమంత్రులు చాలా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్‌ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.   మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని.. యోగా ఆసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని.. ఆత్మ, పరమాత్మను కలిపేదే యోగా అని అన్నారు. ఇంకా ఈ యోగా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొన్నారు.  పేర్కొన్నారు.  

నేపాల్ లో 36 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్...

  నేపాల్ లో నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 36 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(సీఐబీ) పోలీసులు ‘ఆపరేషన్‌ క్వాక్‌’లో భాగంగా నకిలీ వైద్య డిగ్రీలు, లైసెన్సుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో 36మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కాగా వీరందరిని  కాఠ్‌మాండూ జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టగా.. ఐదు రోజులు రిమాండులో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఐదు రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి తగిన చర్యలు చేపడతామని పోలీసులు చెప్పారు.

అమెరికాలో తెలుగు యువకుడు గల్లంతు....

అమెరికాలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం.. ఏపీ.. జగ్గయ్యపేట మండలం బండిపాలెం వాసి పుట్టా నరేశ్‌(24) అమెరికాలో ఎంఎస్ చదివేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే అతను తన స్నేహితులతో కలిసి లివర్‌మోర్‌ నదిలో బోటింగ్ కు వెళ్లగా.. అక్కడ అతను ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. స్నేహితులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారమందించడంతో వారు నరేశ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న నరేష్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిని వెతికిపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

అధికారులపై దేవినేని ఆగ్రహం.. పొలంలోకి దిగండయ్యా..

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి దేవినేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పరిధిలో గొల్లపూడి వద్ద నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా రైతులతో కలిసి పొలంలోకి దిగి.. నాగలి పట్టి దున్నారు. మిగిలిన అధికారులు మాత్రం పొలం గట్లపైన ఉండే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులపై మండిపడ్డారు. గట్లుపైన ముచ్చట్లు పెట్టుకుంటే ప్రజల సమస్యలు తెలియదని..  పొలంలోకి దిగితే తప్పా,రైతుల కష్టమేంటో తెలియదని అన్నారు. దీంతో అధికారులు కూడా పొలంలోకి దిగి నాగలి పట్టారు.   కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని చిట్టవరం గ్రామంలో ఏరువాకను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన కూడా మోకాలిలోతున్న బురదనీటిలోకి దిగిన, తలకు పాగా కట్టుకుని, చర్నాకోల చేతిలో ధరించి, కాడెడ్లను అదిలిస్తూ, దుక్కి దున్నారు.

చెల్లి చనిపోయిందని..చెల్లితో పాటే చితిలోకి

తను ప్రాణాలకన్నా మిన్నగా చూసుకునే చెల్లి చనిపోయే సరికి బ్రతకడం అనవసరమని తాను తనువు చాలించే అన్నలను మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలోనూ చెల్లిలి పట్ల అంతకన్నా ఎక్కువ మమకారాన్ని చూపించే అన్నలున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా పుదుపేట మండలం కొంగరపాళయం గ్రామానికి చెందిన కుమార్, కుమార్ అన్నాచెల్లెల్లు. అతడికి చెల్లెలంటే పంచప్రాణాలు, కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇటీవలే శక్తివేల్ అనే యువకుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. మెట్టినింట ఉన్న చెల్లిల్ని చూడకుండా ఉండలేక తరచూ చూసి వస్తుండేవాడు.   ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా కుమారి శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కుమార్ కుప్పకూలిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. విచారణ అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే చెల్లిని కడసారి చూస్తూ..చితిలో కాలుతున్న ఆమె శరీరాన్ని చూసి తల్లడిల్లిపోయిన కుమార్ వెంటనే చితిపైకి దూకేశాడు. ఊహించని ఈ సంఘటనతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. వెంటనే కుమార్‌ను బయటికి లాగారు. తీవ్రంగా గాయపడిన కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

షీనా బోరా హత్య కేసులో అప్రూవర్ గా డ్రైవర్... కోర్టు గ్రీన్ సిగ్నల్

  షీనా బోరా హత్య కేసులో మరో ట్వీస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షి, హంతకుల్లో ఒకడైన ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్వామ్ వర్ రాయ్ అఫ్రూవర్ గా మారాడు. ఇప్పటికే ఈకేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన అప్రూవర్‌గా మారి నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. షీనా బోరా హత్య కేసుకు సంబంధించి అన్ని వివరాలు తకను తెలుసునని, అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని మే 2016న కోర్టును ఆశ్రయించాడు. శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా  షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇంద్రాణి ముఖర్జీయాతో పాటు ఆమెకు సహకరించిన సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌లతో పాటు పీటర్ ముఖర్జీయా కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా జైలు జీవితం గడుపుతున్నారు.

మన్మోహన్ ను అలా అన్నాడు... సారీ చెప్పాడు..

  ఈ మధ్య నేతలు ఎలా తయారయ్యారంటే.. అవేశంతో తమ నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేయటం.. అది పెద్ద దుమారం అయిన తరువాత మేల్కొని సారీ చెప్పడం. ఇప్పటికి చాలా మంది నేతలనే చూసుంటాం.. ఇప్పుడు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఈయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే ఆయనకు ఎయిర్ పోర్ట్ లో మంత్రులు ఆహ్వానం పలికితే.. మోడీకి మాత్రం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం పలికారని విమర్శించారు. అంతే కటారియా చేసిన వ్యాఖ్యలపై నిరసనలు తలెత్తాయి. ఇంక మంత్రిగారు చేసేముందు ఆఖరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు.. మాట్లాడుతున్నప్పుడు అలా మధ్యలో వచ్చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా.. ఇలా వ్యాఖ్యానించినందుకు క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు.

'యోగా డే' కు భారీగా ఏర్పాట్లు..

  జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్బంగా ఇప్పటికే పలు దేశాల్లో ఏర్పాట్లు భారీగానే జరిగినట్టు కనిపిస్తోంది. రేపు జరబోయే ఈ యోగా డే లో  చండీగఢ్‌లో వేలాది మందితో కలిసి ప్రధాని మోడీ ఆసనాలు వేయనున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఇక ఐరోపా పార్లమెంటులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రారంభించనున్నారు. మొత్తం 190 దేశాల్లో ఘనంగా యోగా డే ను నిర్వహించనున్నారు.   కాగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కోసం 2014 సెప్టెంబరులో ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మోదీ పిలుపునివ్వటంతో జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాస ప్రకటించింది.

మరో బులెట్ రైలోచ్చేస్తుందోచ్..

  ఇండియాకు మరో బులెట్ రైలు వచ్చేస్తోంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ రైల్ ఖరారు కాగా, ఇప్పుడు మరో బులెట్ రైలును తీసుకురానున్నారు. ఈ రెండో బులెట్ రైలు రూట్ ఢిల్లీ, వారణాసి మధ్య రానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి లక్నో మధ్య 506 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల 45 నిమిషాల్లోనే చేరుకునేంత వేగంతో ఇది నడుస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ఇంకా దీని నిర్మాణం కోసం రూ. 43 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వాటిల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న వేళ, యూపీ ప్రజలకు బులెట్ రైలు వరాన్ని ఎన్నికల లోపే మోదీ ప్రకటించవచ్చని సమాచారం.

ఈ దేహానికి వైద్య మెందుకు.. నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి.. ముద్రగడ

కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష పదకొండో రోజుకి చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అటు కుటుంబ సభ్యులు, కాపు నేతలు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కుటుంబసభ్యులు, బంధువులు దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మాత్రం దీక్ష విరమించేందుకు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు 'రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి' అంటూ ఆయన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.   మరోవైపు వైద్యులు కూడా ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో కీటోన్ల సంఖ్య మరింత పెరిగిందని.. ఇది చాలా ప్రమాదకరమని.. దీనివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని తెలిపారు. ఫ్లూయిడ్స్ అందిస్తున్నా ఆయన ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఉందని.. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన ఆరోగ్య రీత్యా మంచిది కాదని వైద్యులు తెలిపారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.