ట్రంప్ పై హత్యాయత్నం... ఊరుకుంటాడా..?
posted on Jun 21, 2016 @ 11:35AM
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అందరికి షాకులిచ్చే డొనాల్డ్ ట్రంప్ కే ఓ యువకుడు దిమ్మతిరిగే షాకిచ్చాడు. అతనిని చంపేదుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్ లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఆ ర్యాలిలో కాలిఫోర్నియాకు చెందిన మైకెల్ స్టాన్ ఫోర్డ్ (19) అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అంతలో సడెన్ గా సెక్యూరిటీగా ఉన్న ఓ పోలీసు వద్ద గన్ లాక్కుని ట్రంప్ ను కాల్చేందుకు ప్రయత్నించాడు. అంతే వెంటనే తేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. లాస్ వెగాస్ లో ట్రంప్ మిస్సయితే తరువాత ఫీనిక్స్ ప్రాంతంలో జరిగే ర్యాలీలో చంపేందుకు సిద్ధమైనట్టు చెప్పాడు. ట్రంప్ ను చంపేందుకు ఒక్కరోజు ముందే లాస్ వేగాస్ వచ్చానని.. గన్ కాల్చడం కూడా ఒక్క రోజులోనే నేర్చుకున్నానని చెప్పాడు.
అసలే ట్రంప్ కు చిన్న విషయం దొరికినా తన నోటికి పని చెప్పి ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు అతనిపైనే ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసిన తరువాత ఊరుకుంటాడా.. ఈ విషయంలో ఎవర్ని విమర్శిస్తాడో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.