మన్మోహన్ ను అలా అన్నాడు... సారీ చెప్పాడు..
posted on Jun 20, 2016 @ 3:21PM
ఈ మధ్య నేతలు ఎలా తయారయ్యారంటే.. అవేశంతో తమ నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేయటం.. అది పెద్ద దుమారం అయిన తరువాత మేల్కొని సారీ చెప్పడం. ఇప్పటికి చాలా మంది నేతలనే చూసుంటాం.. ఇప్పుడు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఈయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే ఆయనకు ఎయిర్ పోర్ట్ లో మంత్రులు ఆహ్వానం పలికితే.. మోడీకి మాత్రం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం పలికారని విమర్శించారు. అంతే కటారియా చేసిన వ్యాఖ్యలపై నిరసనలు తలెత్తాయి. ఇంక మంత్రిగారు చేసేముందు ఆఖరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు.. మాట్లాడుతున్నప్పుడు అలా మధ్యలో వచ్చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా.. ఇలా వ్యాఖ్యానించినందుకు క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు.