ప్రపంచ యోగా డే.. నేతల ఆసనాలు..
posted on Jun 21, 2016 @ 11:14AM
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంఢీగఢ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్ధులు.. కేంద్రమంత్రులు చాలా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని.. యోగా ఆసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని.. ఆత్మ, పరమాత్మను కలిపేదే యోగా అని అన్నారు. ఇంకా ఈ యోగా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొన్నారు. పేర్కొన్నారు.