వామ్మో బామ్మ.. 90 ఏళ్ల వయసులో ఆసనాలు..
posted on Jun 21, 2016 @ 3:51PM
ఈరోజు అంతర్జాతీయ యోగా డే. ఈరోజు అందరూ యోగాసనాలు వేస్తూ యోగా డే ను జరుపుకుంటారు. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు ఆసనాలు చాలా తేలికగా వేసేయోచ్చు. అదే వయసు దాటిన తరువాత వేయాలంటే.. అసలు ఆ వయసులో మన పని మనకు చేసుకోవడానికే చాలా కష్టం.. అలాంటిది యోగాసనాలా అని అనుకుంటున్నారు. కానీ ఆ వయసులో కూడా యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నానమ్మాళ్ అనే భామ. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్- ఒక యోగా టీచర్. 93 ఏళ్ల వయసు. అయినా ఇప్పటికీ ఆమె శరీరాన్ని విల్లులా వంచుతుంది! నానమ్మాళ్ యోగాసనాలు వేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే! దాదాపు 50 రకాల ఆసనాలను ఈ వయసులో కూడా అవలీలగా వేసెయ్యగలదు. 20 వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటిదాకా ఆమె మందు బిళ్ల కూడా మింగలేదంటే నమ్మండి. అంత ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా నానమ్మాళ్ ఖ్యాతి గడించారు.