షీనా బోరా హత్య కేసులో అప్రూవర్ గా డ్రైవర్... కోర్టు గ్రీన్ సిగ్నల్
posted on Jun 20, 2016 @ 4:46PM
షీనా బోరా హత్య కేసులో మరో ట్వీస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షి, హంతకుల్లో ఒకడైన ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్వామ్ వర్ రాయ్ అఫ్రూవర్ గా మారాడు. ఇప్పటికే ఈకేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన అప్రూవర్‌గా మారి నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. షీనా బోరా హత్య కేసుకు సంబంధించి అన్ని వివరాలు తకను తెలుసునని, అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని మే 2016న కోర్టును ఆశ్రయించాడు. శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇంద్రాణి ముఖర్జీయాతో పాటు ఆమెకు సహకరించిన సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌లతో పాటు పీటర్ ముఖర్జీయా కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా జైలు జీవితం గడుపుతున్నారు.