అధికారులపై దేవినేని ఆగ్రహం.. పొలంలోకి దిగండయ్యా..
posted on Jun 20, 2016 @ 5:29PM
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి దేవినేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పరిధిలో గొల్లపూడి వద్ద నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా రైతులతో కలిసి పొలంలోకి దిగి.. నాగలి పట్టి దున్నారు. మిగిలిన అధికారులు మాత్రం పొలం గట్లపైన ఉండే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులపై మండిపడ్డారు. గట్లుపైన ముచ్చట్లు పెట్టుకుంటే ప్రజల సమస్యలు తెలియదని.. పొలంలోకి దిగితే తప్పా,రైతుల కష్టమేంటో తెలియదని అన్నారు. దీంతో అధికారులు కూడా పొలంలోకి దిగి నాగలి పట్టారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని చిట్టవరం గ్రామంలో ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూడా మోకాలిలోతున్న బురదనీటిలోకి దిగిన, తలకు పాగా కట్టుకుని, చర్నాకోల చేతిలో ధరించి, కాడెడ్లను అదిలిస్తూ, దుక్కి దున్నారు.