ఈ దేహానికి వైద్య మెందుకు.. నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి.. ముద్రగడ
posted on Jun 20, 2016 @ 1:12PM
కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష పదకొండో రోజుకి చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అటు కుటుంబ సభ్యులు, కాపు నేతలు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కుటుంబసభ్యులు, బంధువులు దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మాత్రం దీక్ష విరమించేందుకు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు 'రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి' అంటూ ఆయన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.
మరోవైపు వైద్యులు కూడా ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో కీటోన్ల సంఖ్య మరింత పెరిగిందని.. ఇది చాలా ప్రమాదకరమని.. దీనివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని తెలిపారు. ఫ్లూయిడ్స్ అందిస్తున్నా ఆయన ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఉందని.. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన ఆరోగ్య రీత్యా మంచిది కాదని వైద్యులు తెలిపారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.