రణరంగానికి రెడీ కండి.. లేకుంటే కొత్తవారికి దారివ్వండి!
posted on Jul 23, 2022 @ 10:19AM
పూర్వం రాజులు విజయమో వీర మరణమో అనే పెద్ద కాన్సెప్టుతో సైన్యాధ్యక్షుడితో, కీలక సామంతులతో సమావేశమై చివరి హెచ్చరికలు చేసినట్టు ఇపుడు వైసీపీ అధినేత జగన్ కూడా అదే పంధాను అనుసరిస్తున్నట్టుంది. ఒక వంక విమర్శలు, అనను కూలతలు, మరోవంక ప్రకృతి వైపరీత్యాలు.. నిస్సహాయతలో ఎమ్మెల్యేలు.. అయినా వైసీపీ అధినేత జగన్ రెడ్డి మాత్రం విజయం తమదేనని 175 స్థానాలూ తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంకిత భావంతో పనిచేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని వైఎస్సా ర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశంలో ఉద్ఘాటించారు. తాను ప్యాలస్ లో కూర్చన్నా సరే కింది వారంతా క్షేత్రస్థాయిలో తిరగాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచ నలు చేశారు. బాధ్యతలను భారమనుకుంటే లేదా చేయలేమని అనుకుంటే కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తామని ఒక హెచ్చరికా జారీ చేశారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి ప్రతినెలా పథకాలను అందిస్తుండటాన్ని ప్ర జలకు గుర్తు చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే మొత్తం సీట్లు సాధించడం ఖాయమని జగన్ అన్నారు.
అయితే యుద్ధానికి వెళ్లి గాయపడినట్టు అవమానభారంతో తిరిగి వస్తున్న ఎమ్మెల్యేల మాట మాత్రం జగన్ ఏమాత్రం పట్టించు కోవడం లేదన్నది స్పష్టం. ఆయన ఆదేశాలు జారీ చేయడం తప్ప ప్రజల నుంచి వస్తున్నవ్యతిరేకత, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులు పట్టించుకోరు. ఎవరైనా ఆయనకు తెలియజేయడాన్ని సహించలేరు. అసహనం వ్యక్తం చేస్తారు. అలా చెప్పిన వారిపై లేదా చెప్పబోయిన వారిపై ఆగ్రహిస్తారు. మీ ప్రయత్న లోపం అనే ఒకే ఒక్క మాటతో వారి మాటలను ఒక్క ముక్కలో తుంచేస్తారు.
అందర్నీ సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య క్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలదే అన్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని.. త్వరలోనే ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలో పేతం చేయాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టామని.. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు.
పార్టీ పరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నమ్మకంతో ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించామని.. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం పది రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. ప్రతి సచివాలయంకు రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని, ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ సమ న్వయకర్తలు, జిల్లా అధ్యక్షులదే అన్నారు.
పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని సూచించారు. బూత్ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలని.. పార్టీ బూత్ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న రోజుల్లో జగన్ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు అధినేత.