English | Telugu

విజ‌య్ ‘లియో’ కోసం భారీ ప్లాన్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తాజా చిత్రం ‘లియో’. వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రం అక్టోబ‌ర్ 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున్న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. మేక‌ర్స్ ఈ సినిమాను విజ‌య్ గ‌త చిత్రాల కంటే ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నారు. ఇప్పుడు విజ‌య్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాల‌పై తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలే కావు, ఇత‌ర సౌత్ సినీ ఇండ‌స్ట్రీస్‌తో పాటు బాలీవుడ్ సైతం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. అయితే విజ‌య్ త‌న సినిమాల ప్ర‌మోష‌న్స్ కోసం ఎక్కువ‌గా బ‌య‌ట క‌న‌ప‌డ‌రు. ఇంట‌ర్వ్యూ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్ర‌మే పాల్గొంటారు.

అందువ‌ల్ల ‘లియో’ ప్రీ రిలీజ్ కోసం మేక‌ర్స్ భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. సాధార‌ణంగా చెన్నై, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే విజ‌య్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా మ‌లేషియాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తే ఎలా ఉంటుందా? అని అనుకుంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. ‘లియో’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అందుకు కార‌ణం మాస్ట‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రోవైపు లోకేష్ క‌న‌క‌రాజ్.. ర‌జినీకాంత్‌తో సినిమా చేయాల్సి ఉంది.

లియో చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టించారు. ఈ సినిమా కోసం విజ‌య్ అభిమానులు, ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఉన్నాయి. ఎస్‌.ఎస్‌.ల‌లిత్ కుమార్‌, జ‌గ‌దీష్ ప‌ళ‌ని స్వామి నిర్మాత‌లు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.