English | Telugu
మాదాపూర్ డ్రగ్స్... హైదరాబాద్‌లో హీరో నవదీప్
Updated : Sep 15, 2023
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు ప్రముఖంగా చక్కర్లు కొట్టింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నైజీరియన్స్ కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం టాలీవుడ్ నటుడు నవదీప్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని, అయితే తను పరారీలో ఉన్నారని అన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా నటుడు నవదీప్ ఖండించారు. తనకు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన డ్రగ్ కేసుకి సంబంధం లేదని ఆయన అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నవదీప్ అన్నారు.
తన కొత్త సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు నవదీప్ తెలిపారు. పోలీసుల పేర్కొన్న నవదీప్ తాను కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో నవదీప్ ఫ్రెండ్ రామ్ చందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. తను ఇచ్చిన వివరాల మేరకు నవదీప్‌కు ఈ కేసుకి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో ఈడీ, నార్కోటిక్ విచారణకు కూడా ఆయన హాజరైన సంగతి తెలిసిందే.
బేబి సినిమాలో యువత డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలు ఉండటం వల్ల తాము సదరు సినిమా నిర్మాతలకు నోటీసులు ఇవ్వనున్నామని కమీషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ పేర్కొనటం కూడా పెద్ద టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై బేబి దర్శకుడు సాయి రాజేష్ ప్రత్యేకంగా స్పందించారు. బేబి సినిమాలో కథ ప్రకారమే రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని థియేటర్ , ఓటీటీలో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.