English | Telugu

పాపం దిల్‌రాజు... ఇప్పుడేం చేస్తాడో చూడాలి!

నిర్మాత దిల్‌రాజు ఏ సినిమా చేసినా ఎంతో కాలిక్యులేటెడ్‌గా చేస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. తను నిర్మాతగా సక్సెస్‌ అవ్వడానికి అది కూడా ఒక రీజన్‌ అని చెప్పొచ్చు. ఏ సినిమాకి ఎంత బడ్జెట్‌ పెట్టాలి, ఏ కాంబినేషన్‌ ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది, కొత్త టాలెంట్‌ని బయటికి తీసుకు రావడం ద్వారా ఎలా సక్సెస్‌ అవ్వొచ్చు అనే విషయాల్లో అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతోనే ముందుకు వెళతాడు. అయితే ఇప్పుడు తన అంచనాలను తారుమారు చేసిందో సినిమా. అదే రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’.
శంకర్‌ రూపొందించే సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తోనే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది దిల్‌రాజు కూడా గ్రహించాడు కాబట్టే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాకి రూ.250 కోట్లు బడ్జెట్‌ కేటాయించాడు. షూటింగ్‌ జరుగుతూనే ఉన్నా, చాలా లేట్‌ అవుతోందనేది యూనిట్‌ అభిప్రాయం. దానివల్లే బడ్జెట్‌ కూడా పెరిగిపోతోందట. సెప్టెంబర్‌ ద్వితీయార్థంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ కాబోతోంది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా బడ్జెట్‌ రూ.350 కోట్లకు చేరుకుందట. దీంతో దిల్‌రాజు టెన్షన్‌ పడుతున్నాడని తెలుస్తోంది. ప్రొడక్షన్‌లో ఎలాంటి సమస్య వచ్చినా తన తెలివితేటలతో పరిష్కరించే దిల్‌రాజు ఇప్పుడు రూ.100 కోట్ల సమస్యను సాల్వ్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కి గ్లోబల్‌గా ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని వంద కోట్లు బడ్జెట్‌ పెరిగినా ఫర్వాలేదు అనుకుంటాడా? లేక బడ్జెట్‌ని కంట్రోల్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటాడా? ఈ విషయంలో దిల్‌రాజు ఏం చేస్తాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.