English | Telugu
తమ పెళ్ళి ఫోటోను బయటికి తెచ్చిన సమంత.. అసలేం జరుగుతోంది?
Updated : Sep 15, 2023
సినిమా రంగంలో పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది సినిమా రంగం మొదలైన రోజుల నుంచీ ఉంది. అయితే విడాకుల వ్యవహారం మాత్రం ఈమధ్యకాలంలో ఎక్కువైందనే చెప్పాలి. ఆమధ్య నాగచైతన్య, సమంత పెళ్ళి చేసుకొని, ఆ తర్వాత కొన్నాళ్ళకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఏమాయ చేసావె’ చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాలో మాదిరిగానే హిందు, క్రిస్టియన్ పద్ధతిలో నిజ జీవితంలోనూ ఒకటయ్యారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ వారు చూసుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా మంచి ఫామ్‌లోకి వచ్చింది. చాలా హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ‘ఖుషి’ చిత్రంతో మరో హిట్ సాధించింది. కానీ, నాగచైతన్య మాత్రం హిట్‌కి ఆమడ దూరంలోనే ఉండిపోయాడు.
నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడడం అనేది ఎప్పుడూ లేదు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వున్న పెళ్ళి ఫోటోలను ఆర్చీవ్స్‌లో పెట్టేసింది సమంత. తాజాగా ఒక పెళ్ళి ఫోటోను బయటపెట్టింది. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళి చేసుకున్న తర్వాత హగ్ చేసుకొని నాగచైతన్యను సమంత ముద్దు పెట్టుకుంటున్న ఫోటో బయటకు వచ్చింది. దీంతో నెటిజన్ల హడావిడి మొదలైంది. నాగచైతన్యను సమంత మిస్ అవుతుందా? అందుకే మళ్లీ పెళ్ళి ఫోటోను బయటకు తెచ్చిందా? అని కామెంట్ చేస్తున్నారు.