English | Telugu
రానా 'లీడర్' మళ్ళీ వస్తోంది.. ఆ రెండు చిత్రాలకు పోటీ తప్పదా?!
Updated : Sep 15, 2023
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కెరీర్ లో ఎన్ని విజయాలున్నా.. 'లీడర్' (2010) చిత్రంకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. రానా మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. మరీముఖ్యంగా.. దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాని తెరకెక్కించిన విధానం, ఎంచుకున్న కథనం లీడర్ కి ప్రధాన బలంగా నిలిచాయి. ఏవీయమ్ సంస్థ నిర్మించిన ఈ పొలిటికల్ డ్రామా.. భారీ విజయం సాధించకపోయినా మంచి సినిమాగా జనాల మదిలో నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సాగుతున్న రిరిలీజ్ ట్రెండ్ లో భాగంగా లీడర్ ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు.. లీడర్ విడుదల తేది అయిన ఫిబ్రవరి 19నే రిరిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇంచుమించుగా అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో సాగే 'ప్రతినిధి 2', 'యాత్ర 2' కూడా తెరపైకి రాబోతున్నాయి. మరి.. ఆ రెండు సినిమాలకు 'లీడర్' గట్టి పోటీనిస్తుందేమో చూడాలి.