English | Telugu
'మార్క్ ఆంటోని' పబ్లిక్ రివ్యూ.. సిల్క్ స్మిత సీన్ అదిరింది
Updated : Sep 15, 2023
విశాల్, ఎస్. జె. సూర్య కలిసి నటించిన సినిమా 'మార్క్ ఆంటోని'. ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. శుక్రవారం (సెప్టెంబర్ 15) థియేటర్స్ లోకి వచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన ఇది.
ఎస్. జె. సూర్య కామెడీ మార్క్ ఆంటోనికి హైలైట్ గా నిలుస్తోందట. అంతేకాదు.. విశాల్ ఇందులో హీరో అయినా సూర్య ఒంటిచేత్తో సినిమాని నడిపించాడని అంటున్నారు. సిల్క్ స్మిత సీన్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లబ్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో ఫన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అంతకుమించి అన్నట్లుగా ఉందని.. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అంటున్నారు. ఓవరాల్ గా.. వినోదం కోరుకునే వారికి మార్క్ ఆంటోని మంచి టైమ్ పాస్ మూవీ అన్నది పబ్లిక్ టాక్.