English | Telugu

విడాకులు తీసుకోలేదు.. మళ్ళీ కలుస్తారా?

రజనీ కాంత్ లాంటి అగ్రహీరో కూతురుకి భర్త గా ఉండాలంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. అలాగే సూపర్ హీరో ధనుష్ కి భార్యగా ఉండాలంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. ధనుష్, రజనీ కూతురు సౌందర్య పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ అలాగే అనుకున్నారు. కానీ వాళ్లిద్దరూ తమ 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పినప్పుడు అందరూ షాక్ కి గురయ్యారు. తాజాగా ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన ఒక రూమర్ చెన్నై సర్కిల్స్ లో వినబడుతుంది.

ధనుష్ అప్పుడప్పుడే తమిళ సినిమా పరిశ్రమలో పైకొస్తున్న నటుడు. ఆ సమయంలో రజనీ కూతురు సౌందర్య, ధనుష్ లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి రజనీ అభిమానులు చాలా మంది ధనుష్ కి కూడా అభిమానులుగా మారారు. దాంతో తమిళ సినీ రంగంలో ధనుష్ దశ మారిపోయింది. అలాగే తన అద్భుతమైన నటనతో తనకంటూ సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. సౌందర్య కూడా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా మంచి మంచి సినిమాలు తీసి మంచి ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించింది. అలాగే తమిళనాట మంచి ఆదర్శ అందమైన జంటగా కూడా ధనుష్,ఐశ్వర్య ల జంట నిలిచింది.

కానీ ఏమైందో తెలియదు కొన్ని నెలల క్రితం తామిద్దరం విడిపోతున్నామని ధనుష్ ఐశ్వర్య లు బహిరంగంగానే చెప్పారు. దాంతో రజనీ అండ్ ధనుష్ అభిమానులతో పాటు తమిళ చిత్ర పరిశ్రమ అండ్ తమిళ ప్రజలు షాక్ కి గురయ్యారు. కానీ ఇద్దరు చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండానే విడిపోయారు. ఇప్పుడు తాజాగా చెన్నై సర్కిల్స్ లో వాళ్లిదరు మళ్ళీ కలవటానికి సిద్ధంగా ఉన్నారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. కానీ ఇద్దరి వైపు సన్నిహితులు మాత్రం అలాంటిదేం లేదని, ఇద్దరు తమ తమ పనుల్లో బిజీగా ఉండి విడాకులకి అప్లై చెయ్యలేదని, ఒక్కసారి విడిపోయాక ఇక కలవడం జరగని పనని అంటున్నారు. ధనుష్, ఐశ్వర్య విడిపోయినా కూడా తమ పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాటిల్లో ఇద్దరు కలుస్తుంటారు. అలా వాళ్లిదరు కలబోతున్నారనే రూమర్ వచ్చింటుందని, అంతే కానీ ధనుష్,ఐశ్వర్య మళ్ళీ కలవడం జరగని పని అని అంటున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.