English | Telugu
ఆర్జీవీ 'వ్యూహం'లో విలన్ చంద్రబాబు కాదు.. చిరంజీవి!
Updated : Oct 14, 2023
రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్, ఇప్పుడు కొందరి చేతుల్లో కీలు బొమ్మ. గత కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర నాయకులను నెగిటివ్ గా చూపిస్తూ సినిమాలు చేస్తున్నాడు. గత ఏపీ ఎన్నికల సమయంలో అలాంటి పొలిటికల్ మూవీస్ తీసి కొందరికి ప్రయోజనం చేకూర్చిన ఆర్జీవీ.. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.
ఏపీ అధికార పార్టీ వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి అనుకూలంగా ఆర్జీవీ 'వ్యూహం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. జగన్ కి అనుకూలంగా తీసే సినిమా అంటే, అందులో ఖచ్చితంగా చంద్రబాబుని విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ ఆర్జీవీ మాత్రం టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమా విషయంలో కొత్త వ్యూహం అనుసరిస్తున్నాడట. ఈ సినిమాలో చంద్రబాబుకి బదులుగా, చిరంజీవిని విలన్ గా చూపించబోతున్నాడట.
రాబోయే ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, వైసీపీ దారుణమైన ఓటమిని చూడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే ఆర్జీవీ 'వ్యూహం'తో మెగా అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమాలో చిరంజీవిని విలన్ గా చూపించబోతున్నారట. పవన్ పొలిటికల్ లైఫ్ లో చిరంజీవే విలన్ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ప్రధానంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఆ పాత్రను రూపొందించారట. మెగా అభిమానుల మధ్య గొడవలు పెట్టి.. చిరంజీవి అభిమానులను జనసేనకు, తెలుగుదేశంకి దూరం చేసి.. వైసీపీకి లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. మరి మెగా అభిమానులు ఈ ట్రాప్ లో పడతారో లేక ఆర్జీవీ వ్యూహాన్ని తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్తారో చూడాలి.