English | Telugu

బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో 'మంగమ్మగారి మనవడు' ఒకటి. ఈ సినిమాలోని 'దంచవే మేనత్త కూతురా' పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాటకి ఎందరో అభిమానులున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ డీజే రీమిక్స్ వెర్షన్ ను 'భగవంత్ కేసరి'లో చూడబోతున్నాం. ఈ రీమిక్స్ లో బాలకృష్ణ, కాజల్ చిందేసినట్లు సమాచారం. సినిమాతో పాటు ఈ రీమిక్స్ ను ఎప్పుడెప్పుడా చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా అక్టోబర్ 19న విడుదలవుతున్నా, పాటను చూడాలంటే మాత్రం అక్టోబర్ 24 వరకు ఆగాలట. అక్టోబర్ 24 నుంచి మాత్రమే రీమిక్స్ పాటను సినిమాలో యాడ్ చేసి ప్రదర్శిస్తారట. రిపీటెడ్ ఆడియన్స్ తో పాటు, కొత్త ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా చిత్ర బృందం ఈ ఎత్తుగడ వేసిందట. మూవీ టీం ప్లాన్ బాగానే ఉన్నప్పటికీ.. ఆ రీమిక్స్ ఆలస్యంగా చూడనున్నామనే నిరాశ మాత్రం ఫ్యాన్స్ లో కలుగుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.