English | Telugu
శంకర్ దాదా మళ్ళీ వస్తున్నాడు!
Updated : Oct 15, 2023
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎవర్ గ్రీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' ఒకటి. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 అక్టోబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడుదలై 19 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.
టాలీవుడ్ లో కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీ రిలీజ్ లోనూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇప్పుడు శంకర్ దాదా కూడా అదే బాటలో పయనించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 4న రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' చిత్రంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది రీ రిలీజ్ కి పర్ఫెక్ట్ మూవీ. ఇది సందేశాత్మక చిత్రం అయినప్పటికీ పూర్తి వినోద భరితంగా ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. అదిరిపోయే కామెడీ సన్నివేశాలు, పాటలతో బిగ్ స్క్రీన్ మీద మరోసారి ఈ సినిమాని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు.