English | Telugu

యాడ్‌లో నటించాలంటే.. రాత్రంతా మనం చిల్‌ అవ్వాలన్నాడు

సినిమా రంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. దాంతో అన్ని విషయాలూ వెంటనే తెలుస్తున్నాయి. అందువల్లే ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ఆ వార్త మన ముందు ఉంటోంది. అలాగే క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల ఎవరైనా బాధింపబడితే దాన్ని క్షణంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసెయ్యవచ్చు. దాంతో విషయం అందరికీ తెలుస్తుంది. సోషల్‌ మీడియా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటోంది. ఇప్పుడు టాప్‌ హీరోయిన్లుగా చలామణి అవుతున్న హీరోయిన్లలో కొందరు తమ కెరీర్‌ ప్రారంభంలో ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. అయితే అందరూ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కొందరు ధైర్యం చేసి తమకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొస్తారు.

ఇప్పుడు అలాంటి అనుభవం ఓ టీవీ నటికి జరిగింది. మృణాల్‌ నవేల్‌ అనే నటి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘నా కెరీర్‌ ప్రారంభంలో టీవీ యాడ్స్‌ చేసేదాన్ని. దాని కోసం ఆడిషన్స్‌కి వెళ్ళినపుడు నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న క్యాస్టింగ్‌ ఏజెంట్‌ ఆడిషన్‌ రిజల్ట్స్‌ తెలియజేస్తూ ఇద్దరి సెలెక్ట్‌ చేశామని, అందులో నేను కూడా ఒకదాన్నని చెప్పాడు. మీరు సెలెక్ట్‌ అయితే కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి యాడ్‌లో నటించాల్సి వస్తుందని చెప్పాడు. ఆ తర్వాతి రోజే మీరు ఈ యాడ్‌లో నటించాలంటే కాంప్రమైజ్‌ అవ్వాలని నాకు ఓ మెసేజ్‌ పంపాడు ఏజెంట్‌. అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. అయినా ఏం కాంప్రమైజ్‌ అని అడిగాను. దానికి అతను ‘రాత్రంతా ఇద్దరం కలుసుకుని చిల్‌ అవ్వడమే’ అని చెప్పాడు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. అతన్ని నోటికి వచ్చినట్టు తిట్టాను’ అంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించింది మృణాల్‌. తాజాగా మృణాల్‌ వెలుగులోకి తెచ్చిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.