English | Telugu

‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌ లాంచ్

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'  . శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్  చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన 'సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’’ అని అన్నారు.

బేబీ కాంబో రిపీట్... ఏడుస్తున్న వైష్ణవి చైతన్య

సిల్వర్ స్క్రీన్‌పై ఓసారి హిట్ అయితే చాలు, మన మేకర్స్ ఆ జోడీని రిపీట్ చేయటానికి అస్సలు ఏం మాత్రం ఆలోచించరు. అలా రీసెంట్ టైమ్‌లో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరూ కలిసి నటించిన బేబి చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగత తెలిసిందే. తర్వాత వైష్ణవితో సినిమాలు చేయటానికి మన నిర్మాతలు ఆసక్తిని చూపించారు. అయితే ఆమె మాత్రం మరోసారి హిట్ కాంబినేషన్‌ వైపుకే మొగ్గు చూపించింది. బేబి సినిమాను రూపొందించిన సాయి రాజేష్ రైటర్‌గా ఆనంద్ దేవరకొండతో వైష్ణవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

జ‌య‌ప్ర‌ద‌కు షాకిచ్చిన కోర్టు...  జైలు శిక్ష తప్పేలా లేదు!

సీనియ‌ర్ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు జ‌య‌ప్ర‌ద ఇప్పుడు అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. ఈమెకు మ‌ద్రాస్ హైకోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. అస‌లేమైంది? అస‌లు జ‌య‌ప్ర‌ద‌పై కేసు వేసింది ఎవ‌రు? ఏ కార‌ణంతో కేసు వేశారు?  దానికి మద్రాస్ హైకోర్టు ఎలా రియాక్ట్ అయ్యింది? అనే వివ‌రాల్లోకి వెళితే..జ‌య‌ప్ర‌ద‌కు చెన్నైలోని జ‌న‌ర‌ల్ ప్యాట‌ర్స్ రోడ్డులో ఓ థియేట‌ర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్‌, రాజ‌బాబుల‌తో క‌లిసి అన్నా న‌గ‌ర్‌లోని ఓ థియేట‌ర్‌ను కూడా జ‌య‌ప్ర‌ద ర‌న్ చేస్తున్నారు. అయితే ఈ థియేట‌ర్స్ కార‌ణంగానే జ‌య‌ప్ర‌ద‌కు చిక్కులు వ‌చ్చాయి. ఈ థియేట‌ర్‌లో వ‌ర్క్ చేస్తున్న కార్మికుల నుంచి ఈఎస్ఐ సొమ్ముని వ‌సూలు చేసిన‌ప్ప‌టికీ దాన్ని ప్ర‌భుత్వానికి చెల్లించ‌టం లేదంటూ ఓ ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌పై ఫిర్యాదు చేశారు.

ఆ హీరోయిన్‌తో నాని మ‌రోసారి!

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు నెక్ట్స్ మూవీని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యింద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా త‌న ఫ్లాప్ మూవీలో న‌టించిన హీరోయిన్‌తోనే నాని మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌బోతున్నారంటున్నాయి మీడియా వ‌ర్గాలు. నాని నెక్ట్స్ మూవీ హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ విష‌య‌మేమంటే...

ర‌జినీకి షాకిచ్చిన ‘లియో’

దళపతి విజయ్ సినిమా సినిమాకు త‌న రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మాస్‌లో ఆయన‌కున్న క్రేజ్ పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌టం లేదు. తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన ‘లియో’ చిత్రంతో మ‌రోసారి అది ప్రూవ్ అయ్యింది. ప‌నిలో ప‌నిగా ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ఏకంగా ర‌జినీకాంత్ సినిమాను దాటేయ‌టం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ద‌స‌రా సంద‌ర్భంగా లియో సినిమా అక్టోబ‌ర్ 19న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్‌కున్న క్రేజ్‌తో పాటు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో మూవీపై బ‌జ్ పెరుగుతూ వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఈ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే క‌లెక్ష‌న్స్ రావ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ తొలిరోజున ‘లియో’ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంత అనే వివ‌రాల్లోకి వెళితే..