English | Telugu
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.. పవర్ ఫుల్ రోల్ లో విజయశాంతి!
Updated : Oct 20, 2023
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తుంటాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. త్వరలో 'డెవిల్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్న కళ్యాణ్ రామ్.. తాజాగా ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుండటం విశేషం.
అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'NKR21'(వర్కింగ్ టైటిల్). 'రాజా చెయ్యి వేస్తే' ఫేమ్ ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకి దర్శకుడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. ఈ మూవీ నేడు(అక్టోబర్ 20న) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. బలమైన కథతో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయశాంతి పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని, అందుకే ఆమె ఈ పాత్ర చేయడానికి వెంటనే అంగీకరించారని అంటున్నారు.