English | Telugu
టాలీవుడ్.. ఆ హీరోలకు, దర్శకులకు ఎందుకంత అసూయ?
Updated : Oct 20, 2023
ఏ రంగంలోనైనా పోటీ సహజం. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. సినీ పరిశ్రమలో కూడా ఎంతో పోటీ ఉంటుంది. అయితే తమది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని పలువురు హీరోలు, దర్శకులు వేదికల మీద చెబుతుంటారు. కానీ అది మాటలకే పరిమితమని.. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు.. ఇతరుల విజయాలను తట్టుకోలేక అసూయతో రగిలిపోతారు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న టాక్.
జయాపజయాలు సహజం. ఇతరులు విజయం సాధించినప్పుడు వారిని అభినందించి, తాము అంతకుమించిన విజయం సాధించడానికి కృషి చేయాలి. దానిని ఆరోగ్యకరమైన పోటీ అంటారు. కానీ సినీ పరిశ్రమలో కొందరి తీరు అందుకు భిన్నంగా ఉంది. ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఆ మధ్య ఒకట్రెండు సినిమాల అనుభవమున్న ఓ యువ హీరో సంచలన విజయాన్ని సాధించాడు. ఆ సమయంలో ఎందరో తోటి హీరోలు అసూయతో రగిలిపోయారట. ముఖ్యంగా ఓ హీరో అయితే.. అప్పుడు అందరూ ఆ సినిమా గురించి, ఆ హీరో గురించే మాట్లాడుతుండటంతో.. తట్టుకోలేక కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళిపోయాడట.
ఇటీవల ఓ దర్శకుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ సక్సెస్ ని చూసి మరో దర్శకుడు జెలసీ ఫీలవుతున్నాడట. అంతేకాదు గతంలో ఓ హీరో చేసినట్టుగానే.. ఈ దర్శకుడు కూడా విదేశాలకు చెక్కేసి.. సాటి దర్శకుడి సక్సెస్ ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడట.
ఇలా టాలీవుడ్ లో ఇతరుల సక్సెస్ ని చూసి అసూయ పడే హీరోలు, దర్శకులు మరికొందరు ఉన్నారని వినికిడి. ఇతరులు విజయం సాధిస్తే, అంతకుమించిన విజయం సాధించడానికి కృషి చేయాలి. అప్పుడే వారితో పాటు పరిశ్రమ కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని ఆ కొందరు హీరోలు, దర్శకులు ఎప్పటికి గుర్తిస్తారో ఏంటో.