English | Telugu
రొటీన్‌కి భిన్నంగా అడివి శేష్!
Updated : Oct 20, 2023
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌లో గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడా? అనే సందేహం సినీ లవర్స్‌కు వస్తుంది. అందుకు కారణం హిట్ 2 మూవీ తర్వాత ఆయన కథానాయకుడిగా నెక్ట్స్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. వరుస సక్సెస్‌ల మీదున్న శేష్ ఇలా ఆలస్యం చేయటానికి కారణమేంటి? గూఢచారి సీక్వెల్ ఎంత వరకు వచ్చింది? అసలు గూఢచారి సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందా? లేదా అనే ఆసక్తికరమైన కథనం మీకోసం...
శేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌గా జీ 2ను చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. గూఢచారిని మించిన కథతో శేష్ ఈ సినిమాను తెరకెక్కించాలని రైటింగ్ మీద ఫుల్ పోకస్ పెట్టినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది.
అడివి శేష్ గూఢచారి సీక్వెల్‌తో పాటు మరో సినిమాను చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతే కాదండోయ్ శేష్ చేయాలనుకుంటున్న రెండో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సైలెంట్‌గా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఓ సినిమా సెట్స్ పై ఉంటే దాన్ని కంప్లీట్ చేయకుండా శేష్ మరో సినిమాను ఓకే చేయరు. కానీ ఈసారి మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఒకేసారి రెండు సినిమాలను లైన్ పెడుతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.