English | Telugu

ర‌జినీకి షాకిచ్చిన ‘లియో’

దళపతి విజయ్ సినిమా సినిమాకు త‌న రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మాస్‌లో ఆయన‌కున్న క్రేజ్ పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌టం లేదు. తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన ‘లియో’ చిత్రంతో మ‌రోసారి అది ప్రూవ్ అయ్యింది. ప‌నిలో ప‌నిగా ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ఏకంగా ర‌జినీకాంత్ సినిమాను దాటేయ‌టం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ద‌స‌రా సంద‌ర్భంగా లియో సినిమా అక్టోబ‌ర్ 19న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్‌కున్న క్రేజ్‌తో పాటు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో మూవీపై బ‌జ్ పెరుగుతూ వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఈ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే క‌లెక్ష‌న్స్ రావ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ తొలిరోజున ‘లియో’ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంత అనే వివ‌రాల్లోకి వెళితే..

మాస్ట‌ర్ సినిమా త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా లియో. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్టే లోకేష్ క‌న‌క‌రాజ్ మూవీని మాస్‌గా తెర‌కెక్కించ‌టంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేసింది. ఈ సునామీలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన 2.0 వ‌సూళ్ల‌ను సైతం లియో దాటేయ‌టం కొస‌మెరుపు. త‌మిళ‌నాడులో 2.0 సినిమా తొలిరోజున ఏకంగా రూ.36 కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అయితే లియో తొలి రోజున ఏకంగా రూ.38 కోట్లను రాబ‌ట్టటం విశేషం.

ఇక లియో సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇత‌ర రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌ల‌తో పాటు క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌ల‌లోనూ, ఓవ‌ర్ సీస్‌లోనూ భారీగానే విడుద‌ల చేశారు. ఇత‌ర రాష్ట్రాలు, త‌మిళ‌నాడుతో క‌లిపి లియో సినిమా తొలి రోజున ఏకంగా రూ.80 కోట్ల‌ను క్రాస్ చేసింది. ఇక ఓవ‌ర్ సీస్‌లో అయితే ఫ‌స్ట్ డే ఏకంగా ఈ సినిమా రూ.50 కోట్ల‌ను రాబ‌ట్టింది. అంటే మొత్తంగా చూస్తే లియో సినిమా తొలి రోజున రూ.135 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. మ‌రి ఫుల్ ర‌న్‌లో ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో చూడాలి మ‌రి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .