English | Telugu
ఆ హీరోయిన్‌తో నాని మరోసారి!
Updated : Oct 20, 2023
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నెక్ట్స్ మూవీని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తన ఫ్లాప్ మూవీలో నటించిన హీరోయిన్‌తోనే నాని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారంటున్నాయి మీడియా వర్గాలు. నాని నెక్ట్స్ మూవీ హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ విషయమేమంటే...
నేచురల్ స్టార్ నాని రానున్న డిసెంబర్ 7న హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో నేచురల్ స్టార్ ఏకంగా తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత నాని తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయతో చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. నవంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ఉంటుందని సమాచారం. అయితే హాయ్ నాన్న సినిమా రిలీజ్ సమయంలో కాస్త గ్యాప్ తీసుకుంటారు. ఆ లోపు కాస్త షూటింగ్ మాత్రమే కంప్లీట్ అవుతుంది.
హాయ్ నాన్న రిలీజ్ తర్వాత వివేక్ మూవీపై నాని ఫుల్ ఫోకస్ పెట్టేస్తారు. వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు అంటే సుందరానికీ వంటి కామెడీ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటించనుంది. ప్రియాంకతో నాని ఇది వరకే నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టుకోలేదు. అయినప్పటికీ నాని మరోసారి ప్రియాంకతో వర్క్ చేయబోతున్నారు. మరి ఈసారైనా వీరి జోడీ వర్కవుట్ అవుతుందేమో చూడాలి మరి.