English | Telugu
కూతురు పుట్టిన ఆనందంలో బలగం వేణు!
Updated : Oct 21, 2023
జబర్దస్త్ వేణు కంటే బలగం వేణుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వేణు రెండోసారి తండ్రయ్యాడు. మంచి కమెడియన్‍గా పేరు తెచ్చుకున్నాడు వేణు. అందరి ప్రశంసలను అందుకున్నారు. దీంతో కమెడియన్ వేణు డైరెక్టర్ వేణుగా ఫేమస్ అయ్యాడు. అలాంటి వేణు ఇప్పుడు తన ఫాన్స్ కి గుడ్‍న్యూస్ చెప్పాడు. తనకు ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. “ఆడబిడ్డ పుట్టింది. నా ఫామిలీతో ఈ విషయం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని వేణు పోస్ట్ చేశారు. కూతురిని ఎత్తుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. వేణుకు ఇప్పటికే రేవంత్ అనే బాబు ఉన్నాడు. అతడితో కలిసి దిగిన ఫొటోలను చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వేణు. ఇక బలగం మూవీకి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన బలగం చిత్రం రూ.26కోట్లపై పైగా గ్రాస్ కలెక్షన్లను రాబతిన్నట్టు అంచనా. వేణు తన కెరీర్ స్టార్టింగ్ లో ‘రణం’ ‘ఖతర్నాక్’ ‘మున్నా’ మూవీస్ తో పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే ‘జబర్దస్త్’ కామెడీ షో అతని రేంజ్ ను ఇంకా పెంచింది అని చెప్పాలి. జబర్దస్త్ పీక్స్ లో ఉన్నప్పుడే బయటకు వచ్చేసి రైటర్ గా పలు సినిమాలకు పనిచేసి, దిల్ రాజు బ్యానర్లో ‘బలగం’ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీ మీద గ్రూప్స్ పరీక్షల్లో కూడా ఒక ప్రశ్న కూడా రావడం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు.