English | Telugu

వర్మ వ్యూహం కి బ్రేక్ 

నట్టికుమార్.. ఒక సినీ నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. అలాగే ఆయన నిర్మాత మాత్రమే కాదు ఒక ఎగ్జిబిటర్ కూడాను .చిన్న సినిమా లు బతకాలని అనుక్షణం తపించే వ్యక్తి.ఎప్పుడు సినీ పరిశ్రమ మంచిని కోరుకునే అయన దాదాపు ఇరవై ఏళ్ళు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటున్నారు. అలాగే సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలకి మంచి జరగడం కోసం ఎంతవరకైనాపోరాడతారు. ఇప్పుడు ఆయన తాజాగా ఒక సినిమా ని ఆపివేయాలని సంబంధిత అధికారులకి తన లాయర్ ద్వారా వినతి పత్రం తో పాటు గతంలో అధికారులు ఆపివేసిన ఒక సినిమా తాలుకు ఆర్డర్స్ ని అధికారులకి పంపించడం సంచలనం సృష్టిస్తుంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నుంచి వస్తున్న తాజా మూవీ వ్యూహం. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ ఆ విషయం స్పష్టంగా చెప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ లకి వ్యతిరేకంగా వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలంగాణా రాష్ట్రం లో విడుదల కాకుండా ఆపాలని నట్టికుమార్ తన లాయర్ ద్వారా సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ,తెలంగాణ చీఫ్ ఎలక్షన్కమీషనర్, మరియు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసారు. తెలంగాణా రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల వ్యూహం సినిమాను తెలంగాణాలో విడుదల కాకుండా ఆపాలని అలాగే గతంలో ఒకసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ని కూడా అప్పుడు ఉన్న ఎలక్షన్ కమీషన్ అధికారులు అపివేసారని గుర్తు చేస్తూ అందుకు సంబంధించిన ప్రతుల్ని కూడా నట్టికుమార్ తన లాయర్ ద్వారా ఉన్నతాధికారులకి పంపించాడు.

వ్యూహం సినిమాలో వర్మ చుపించబోతున్నవన్ని పచ్చి అబద్దాలని కావాలనే తనకి నచ్చినట్టుగా చంద్రబాబు గారిని పవన్ గారిని తక్కువ చేసి చూపిస్తున్నాడని ఒక వేళ సినిమా రిలీజ్ అయితే శాంతి భద్రత లకి భంగం వాటిల్లవచ్చని తన ఫిర్యాదులో స్పష్టం గా చెప్పాడు. అలాగే పక్కా ప్లాన్ ప్రకారమే వ్యూహం సినిమా ని కట్టు కధలతో అల్లారని పూర్తి పొలిటికల్ కథతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయనను పాజిటివ్ గా చూపిస్తూ ఇతర నాయకులను తక్కువచేసి చూపిస్తున్నాడని నట్టికుమార్ చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు కు సంబందించిన అంశాలు కూడా ఈ సినిమాలో పెట్టారని గతంలో ఇలాగే 2019వ సంవత్సరంలో వర్మ దర్సకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ని కూడా ఎలక్షన్ కోడ్ సమయంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించగా ఎలక్షన్ కమీషన్ ఆ సినిమా విడుదలను ఆపివేసింది అని గుర్తు చేస్తున్నారు.ఈ సినిమాకి వైసిపి నాయకుడు అలాగే గత సంవత్సరం తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గా పని చేసిన దాసరి కిరణ్ కుమార్ నిర్మాత.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.