English | Telugu

బాలయ్య తుఫాన్..రెండవరోజు 51 .12 కోట్లు 

ఇప్పటివరకు తెలుగు ప్రజలు ఎన్నో తుఫాన్ లని చూసుంటారు. ఆ తుఫాన్లకి పెట్టిన రకరకాల పేర్ల గురించి కూడా వినే ఉంటారు. ఇప్పుడు తెలుగు ప్రజలకి ఒక సరికొత్త తుఫాన్ ని ఆతుఫాన్ కి ఉన్న సరికొత్త పేరుని పరిచయం చేయబోతున్నాం. ఆ తుఫాన్ భగవంత్ కేసరి..పేరు బాలయ్య తుఫాన్.

మొన్న 19 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాలయ్య భగవంత్ కేసరి మూవీ రెండు రోజులకి గాను 51 . 12 కోట్లు వసులు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో పక్కా పాజిటివ్ టాక్ తో సరి కొత్త రికార్డు లని సృష్టించే పనిలో భగవంత్ కేసరి ఫుల్ బిజీ గా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లని బాలయ్య కబ్జా చేసాడేమో అనే విధంగా బాలయ్య హవా కొనసాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా కి రావటం స్టార్ట్ చేసారు. శ్రీ లీల ,బాలయ్య ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు.

విజయ దశమిని అమ్మవారి శక్తికి ప్రతి రూపంగా భావిస్తారు. అలాగే ఈ భగవంత్ కేసరి మూవీ లో కూడా ఆ అమ్మవారి ప్రతీకలైన ఆడవాళ్ళకి తమ శక్తిని గురించి బాలయ్య తెలియచేయడం యాదృచ్ఛికమే అయినా ఆడవాళ్లు మాత్రం భగవంత్ కేసరి సినిమా ని చూసి తమ అభిప్రాయాన్ని పైన చెప్పుకున్న విధానం తో పోల్చి చెప్తున్నారు .తొలి రోజే 32 .33 కోట్లు వసులు చేసిన బాలయ్య ఇప్పుడు రెండవ రోజుకే 51 .12 కోట్లు కి చేరుకోవడం తో రాబొయ్యే రోజుల్లో బాలయ్య ఇంకెన్ని రికార్డు లు సృష్టిస్తాడో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.