సంయుక్త మీనన్ తెలుగు గురువు ఎవరో తెలుసా?
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/ 'వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సంయుక్త మీనన్ సార్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు...