English | Telugu

ఈ ముగ్గురిలో ఎవరు విజేతగా నిలుస్తారు!?

సౌత్ ఇండియా నుండి ఈ ఏడాది ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. అవి భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. సౌత్ ఇండియా సినిమా బ్రాండ్ నేషనల్ అయింది. మన సినిమా మార్కెట్ కూడా పెరిగింది. మన సినిమా బ్రాండ్ నేషనల్ వైడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. అయితే ఆ మార్కెట్ను అందుకోవడంలో కొంతమంది విఫలమవుతున్నారు. మరికొందరు సక్సెస్ఫుల్‌గా బీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో స‌లార్ మూవీ విడుదల కానుంది.

భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యాయి. దాంతో ప్రభాస్ అభిమానులు స‌లార్ పైనే తమ నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎలాగైనా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇళయ దళపతి విజయ్ లోకేష్ కనకరాజు కాంబోలో లియో టైటిల్ తో సినిమా రాబోతుంది. లోకేష్ యూనివర్స్ లో భాగంగా మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. దీని పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజిలో ఈ మూవీని లోకేష్ కనకరాజు ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు కాకుండా మణి రత్నం నుంచి పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 వస్తోంది. గత ఏడాది మొదటి పార్ట్ వచ్చింది. ఈ ఏడాది రెండో పార్ట్ విడుదలవుతోంది.

ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ లో ఇది భారీ మల్టీ సినిమాగా రాబోతుంది. ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఈ మూడు సినిమాల పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో 500 కోట్ల మార్కును క్రాస్ చేసే సినిమాలు ఏవి అనేది ఆసక్తి నెలకొంటుంది. వీటిలో ఒక్క సినిమా అయినా వెయ్యి కోట్లకి రీచ్ కావాలని సౌత్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఆ రికార్డు ఎవరి సొంతమవుతుంది అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.